సమాజంలో జరుగుతున్న అన్యాయాలకీ, అక్రమాలకీ, వేధింపులకీ ప్రపంచంలో ఏదో ఒక చోట నిత్యం మహిళలు గళం విప్పుతూనే ఉన్నారు. సమాజంలోనే కాకుండా పాలనా వ్యవస్థలో కూడా చైతన్యాన్ని తీసుకురావడానికి అహర్నిశలూ శ్రమిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలతో మమేకమైఐ వారి ఆశయాలకు ఒక రూపకల్పన చేస్తున్నారు. స్వచ్ఛంద సేవలు నిర్వ హించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటువంటివారికి చేయూత నందిస్తేనే పూర్తిగా సాధ్యమవు తుంది. నేర ప్రవృత్తి చాలావరకూ తగ్గి, మంచి సమాజం ఏర్పడుతుంది. నేర ప్రవృత్తి లేని సమాజాన్ని రూపొందించాలంటే అది విద్యార్ధి దశ నుంచే మొదలవ్వాలని అంటుంది మన ఆదర్శ నేపాలీ మహిళ డా. నితి రాణా.
ఈమె 22 సంవత్సరా లుగా నేపాలీ యువత తమకాళ్ళ మీద వారు నిలబడే విధంగా, వృత్తిపరమైన ఉద్యోగా మీద ఆశక్తి కలిగే విధంగా తను స్థాపించిన ‘న్యూ ఎరా కెరీర్ డవలప్మెంట్ ఇస్టిట్యూట్’ ద్వారా వారిని తీర్చిదిద్దుతోంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంకోసం అన్ని రంగాల్లోను నిష్టాతులైన యువతని ఏర్పాటు చేసింది. ఈ విధంగా రాణా రెండు సంస్థల్ని స్థాపించింది. అందులో ఒకటి ‘రక్ష్యా నేపాల్’, ఇది స్కూళ్ళలో జరిగే వేదింపుల నుంచి రక్షణ కల్పించే నేపధ్యంలో పనిచేస్తూ వుంటుంది. రెండవది ‘అమర్ జ్యోతి ఫౌండేషన్’. ఇది అణగారిన వర్గాల కోసం స్థాపించబడింది. ఇక డా. నితి రాణా తన ఆశయాలు, సాధన, అందుకు ఆమె చేపట్టిన కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం.
నితి రాణా మాటల్లో...
నేను గత 22 ఏళ్ళుగా ‘నూతన శక జీవనాభివృద్ధి సంస్థ’ (ది న్యూ ఎరా కెరీర్ డవలప్మెంట్ ఇన్టి ట్యూట్)ను నిర్వహిస్తున్నాను. ఇదే దేశంలో మొట్టమొదటి వృత్తి పరమైన శిక్షణ నిచ్చే సంస్థ. ఈ సంస్థలో సెక్రటే రియల్ మానేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, కష్టమర్ సర్వీస్, లీడర్ షిప్, పర్సనాలిటీ డవలెప్ మెంట్లతో పాటు యువతకి తమకాళ్ళ మీద తాము నిలబడటానికి అవసరమైన ఇతర రంగాల్లో కూడా శిక్షణ నివ్వ డం, వారికి వారి పట్ల పూర్తి విశ్వాసం కలగచేయడం, మా ప్లేస్మెంట్ సర్వీసెస్ ద్వారా మంచి ఉద్యోగాల్లో నియమించడం చేస్తున్నాను. నేను అమర్ జ్యోతి ఫౌండేషన్ అనే సంస్థని కూడా స్థాపించాను. ఈ సంస్థ నాలుగు రంగాల్లో పనిచేస్తుంది. కళలు, స్పోర్ట్స, వృద్ధుల రక్షణ, నిస్ఫృహ తొలగించడం.ఈ షౌండేషన్ కేవలం సహాయసహకారాలు అందించడం కోసం ఏర్పాటుచేయబడ్డ స్వచ్ఛంద సంస్థ. ఇది పూర్తిగా పైన చెప్పిన నాలుగు రంగాల్లోను, అణగారిన వర్గాల ప్రజలకి చేయూత నివ్వడమే స్వచ్ఛందంగా పనిచేస్తోంది. అందులోనూ మరీ ముఖ్యంగా నిరాశకు లోనైనవారిని ఉత్సాహపరిచి వారికి మంచి భవిష్యత్తు మీద అవగాహన కల్పించడం. నిజానికి నిరాశ వీడితే అటువంటివారికి ఎవరి సహాయం అవసరం ఉండదు కదా..!
ఈ ఉద్దేశ్యంతో మేము చేస్తున్న సేవలు నేపాల్ల్లో ఎంతో గుర్తింపుని, ఆదరణని పొందాయి.ఇక నేను నేపాల్ల్లో స్కూలు వేదింపుల నేపథ్యంలో పరిశోధన చేసిన తొలి మహిళని. అందుకు ప్రొఫెసర్లు చాలా నిరుత్సాహ పరిచారు. ఎందుకంటే ఈ విషయం గురించిన పాఠ్యాంశాలు ఏవీ లభ్యం కావనీ, కాబట్టి మరో సబ్జెక్ట్ ఏదైనా తీసుకోమనీ అన్నారు. అయితే నేను వాళ్ళకి చెప్పాను. ఇది కొత్త కోణం, ఎవరోఒకరు దీని మీద కూడా పరిశోధన చేయాలి. అందువల్ల నేను వేదింపుల మీదే పరిశోధన గావిస్తానన్నాను. కొన్ని సంవత్సరాల నా పరిశోధన తర్వాత ఇది పూర్తిగా ఎవరూ పట్టించు కోకుండా వదిలేసిన అంశంగా అనిపించింది.నా స్కూలు పరిశోధనానుభవంలో ఈ వేదింపు అనేది రోడ్ల మీద ఈవ్ టీజింగ్, కాలేజీ ర్యాగింగ్లే కాకుండా ఎన్నో విపరీత పరిస్థితుల్ని చూసాను, పరిశోధించాను. అందు లోంచి రూపుదిద్దుకున్నదే ‘రక్ష్యా నేపాల్’ సాటివారిచేత వేదింపులు లేకుండా విద్యార్ధులు వారికి వారే తెలుసుకునేలా చూడటం ఒక కొత్త ప్రక్రియగా మొదలుపెట్టాను. వేదించడం అనేది ఎంత అపాయక రమో వారికి తెలిసేలా చేయడం, ఎంతమంది ఈ వేధింపుల వల్ల బాధపడ్డారో, వారికి ఏ విధంగా మనం సహకారం అందించాలో, అసలు ఎందుకు ఎదుటి వారిని వేదించాలి? అనే కోణాల్లో తెలియచెప్పి మంచి విద్యార్ధులుగా వారిని తయారుచేయడం జరుగు తోంది. కేవలం ఏదో పరిశోధన చేసేసి, డిగ్రీ పట్టా పుచ్చు కుని దానిని గూట్లో అందంగా అలంకరిం చుకుని, ఏదో ఒక ఉద్యోగం సంపాదించడం ఒక్కటే చాలదు.
విద్యావంతులు ఏదో ఒకటి చేయాలి. ఆ తపన లోంచే నేను ‘రక్ష్యా నేపాల్’ని స్థాపించాను. అంటూ తన భావాలు పంచుకుంది నితి రాణా. ఎవరో, ఎప్పుడో, ఏదో చేస్తారని కూర్చుంటే ముందు తరాలు మరింత దిగజారిపోయే అవకాశం చాలా దగ్గరలోనే ఉంది. ఆ తరాల్లో మనవారు కూడా ఉంటా రన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మంచి సమాజంలోనే మన పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు. ఢిల్లీ దుర్ఘటన చాలా భాదాకరమైన విషయం. ఇటు వంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలం టే, విద్యార్ది దశ నుంచే వారిని తీర్చిదిద్దాలి. సుశిక్షితు లైన, మంచి నడవడిక కలిగిన ఉపాద్యాయుల నేతృత్వంలో విద్యాలయాలు కొనసాగవలసిన అవస రం కూడా ఎంతైనా ఉంది. పోటీ పరీక్షలు పెట్టి విద్యా ర్ధుల్ని వేదించే కన్నా, ముందు వారిని తీర్చిదిద్దడం, దేశం పట్ల, దేశ పరువుప్రతిష్టల పట్ల, దేశ ప్రజల పట్ల మంచి సదవగాహన కలిగేలా శిక్షణ ఇవ్వడం నేటి పరిస్థితుల్లో ఎంతైనా అవసరం ఉంది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more