Kavitha lankesh gauri lankesh

kavitha lankesh and gauri lankesh

kavitha lankesh and gauri lankesh special article.

Kavitha Lankesh Gauri Lankesh.png

Posted: 12/28/2012 12:19 PM IST
Kavitha lankesh gauri lankesh

kavita_lankeshఎవరైనా ఎలాగైనా బతికేస్తారు. కానీ ఒక స్థాయిలో బతకడానికి అవిరళ కృషి చేస్తారు కొందరు. ఇలా అనుకున్నది సాధించడంలో ముందుంటారు మహిళలు. ఈరోజు ప్రపంచాన్ని మహిళలే ఏలుతున్నారనడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. అందులోను, మహిళలు కుటుంబ బాధ్యతలు స్వీకరించడం దలు పెట్టి ఆదాయ మార్గాల్లో అడుగుపెట్టిన తొలి రోజుల్నించి, కుటుంబ భారం వారికి తెలియకుండానే వారి మీద పడింది. ఇక ఒక కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు ఆడపిల్లలుంటే వాళ్ళ భవిష్యత్తుకి తీసుకునే నిర్ణయాలు కూడా ఒక ప్రత్యేక స్థాయిలోనే ఉంటున్నాయి. అలా తమ సత్తా చాటుకుంటున్న పి. లంకేష్‌ కుమార్తెలు ఇద్దరు కర్నాటక సోదరీమణుల గురించి కొన్ని విషయాలు....

గౌరీ లంకేష్‌గౌరీ లంకేష్‌ కర్ణాటకలో ప్రముఖ జర్నలిస్టు. ఆమె  లంకేష్‌  కన్నడ వారపత్రికకు సంపాదకురాలు. దళిత, రైతు, స్ర్తీ పక్షపాతిగా ఆమెకు ముద్రపడింది. కర్ణాటక కమ్యూనల్‌ హార్మనీ ఫోరమ్‌ సభ్యురాలు.గౌరీ లంకేష్‌ తండ్రి పి. లంకేష్‌ లంకేష్‌, పత్రికను 20 సంవత్సరాలు నడిపారు. తండ్రి 2000 సంవత్సరంలో కాలం చేసిన తర్వాత పత్రిక బాధ్యతలను ఆమె చేపట్టారు. గాంధీజీ సెక్కులర్‌ భావనలు, బసవన్న సమసమాజం, అంబేద్కర్‌ భావాలను ఆదర్శంగా తీసుకొని ఆమె పత్రికను నిర్వహిస్తున్నారు. ఆమె ప్రభుత్వ పధకాల అమలులో లోపాలుంటే తూర్పారపడుతుంది. కర్ణాటక మాధ్యమ అకాడమీలో జర్నలిజం చేసిన గౌరి కర్ణాటక కమ్యూనల్‌ హార్మనీలో సభ్యురాలు.

కవితా లంకేష్‌ జర్నలిస్ట్‌ కుటుంబంలో గౌరీ తర్వాత పుట్టిన ఈమె కూడా కన్నడ సినీ పరిశ్రమలో దర్శకురాలిగా, రచ యిత్రిగా, స్క్రీన్‌ ప్లే రైటర్‌గా బహుముఖ ప్రజ్ఞావం తురాలిగా తనకొక ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కుంది. కవిత తొలిసారిగా పిల్లల మనస్థత్వాల నేప థ్యంలో ఒక లఘుచిత్రాన్ని నిర్మించి సినీరంగ ప్రవే శం చేసింది. ఈ లఘుచిత్రానికి ఎంతో ఆదరణ ల భించడంతో తన తండ్రి పి. లంకేష్‌ రాసిన ఒక కథ ఆధారంగా 1999లో నిర్మించిన దేవేరి చిత్రానికి తా నే దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించింది. ఈచిత్రం కూడా ఘన విజయాన్ని సాధించడంతోపాటు జాతీ య, అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. అలాగే రాష్ట్ర అవార్డు కూడా దక్కించుకుంది. అంతర్జాతీయ విమర్శకుల అవార్డుకు కూడా ఈమెకు దక్కింది. అ లాగే తొలి జాతీయ దర్శకురాలు అవార్డుతో ఈమె ను సత్కరించారు. దేవేరి చిత్రం అనేక అంతర్జాతీ య ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శింపబడింది.


ఆమె పత్రికలో ప్రకటనలు వుండవు. గౌరి మరోకో ణంలో సిటిజన్స్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌పీస్‌లో సభ్యురా లుగా కూడా తన సేవలందిస్తోంది. ఆదివాసీలు కూ డా ఆర్థికంగా పురోగమించాలన్నదే ఆమె జీవితాశ యం. అయితే కొందరు నక్సలైట్లకు ఆమె మద్దతు ఇస్తుందంటారు. బెంగుళూరు విశ్వవిద్యాలయంలో ఆమె చదువుచున్నప్పుడు నక్సలైట్‌ నేత సాకేత్‌ రాజ్‌ (ప్రేమ్‌) ఆమెకు సీనియర్‌ విద్యార్థి. ఇద్దరూ ఢిల్లీలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ లో పోస్‌‌టగ్రాడ్యుయేషన్‌ చేశారు. ఈమె క్లాస్‌మేట్‌ ప్రేమ్‌, ఎన్‌ కౌంటర్‌లో మరణించగా, మానవ హ క్కుల ఉల్లంఘన విషయంలో గౌరి గొంతెత్తితే, ఆమె ను నక్సలైట్‌ అనికొందరు ముద్రవేశారు.సోదరుడు ఇంద్రజిత్‌ లంకేష్‌ ఆమెతో విభేదించి వెనుదిరిగారు.ఇప్పుడు గొడవ సద్దుమణిగింది. గౌరీలంకేష్‌ పత్రిక బెంగుళూరులోని పాత భవంతిలో వుంది. 50 మంది ఈ వార పత్రికను నిర్వహిస్తున్నారు.

gauri_lankeshగౌరి సుప్రసిద్ధ ఆంగ్ల పత్రిక  తెహల్కా కు కూడా అనేక కథనాలు వ్రాసారు. ఆమె కేవలం రచయితే కాకుండా సామాజిక కార్యకర్త అంటారు. ఆమెకు ఆంగ్లంలో నూ, కన్నడంలోనూ భాషపై పట్టువుంది. ఆమె ఢిల్లీ, బెంగుళూరులో 15 సంవత్సరాలు ఇంగ్లీష్‌ పత్రికా రంగానికి విశేష సేవ లందించారు.లంకేష్‌ పత్రికలో ఆమె సంపాదకీయాలకు పెట్టింది పేరు. సామ్యవాదం, మానవతా విలువలకు దర్ప ణంగా వుంటాయి. పెట్టుబడీదారీ విధానం అంటే ఈమెకు ఎంతమాత్రం ఇష్టపడదు. అందుకు వ్యతి రేకంగా ఈమె ఎన్నోసార్లు తన రచనల ద్వారా బా హాటంగానే వ్యక్తీకరించి. ప్రభుత్వ దమననీతిని కూ డా తూర్పారబెడుతుంది.

ప్రభుత్వ ఆశయాలకు గ్రుడ్డిగా కొమ్ముకాయడం కంటే పత్రికను మూసివేయడమే మంచిదంటుంది గౌరి.సమాజచైతన్యంకోసం అహర్నిశలూ కృషిచేస్తుంది. ఒక విధంగా ఈమెను ప్రల మనిషిగా అనుకోవచ్చు. ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే స్పందించి దానిని ప్రజల ముందు కు తీసుకురావడంలో ఎంతమాత్రం సంకోచించ డు. ధైర్యంగా ఎదురొడ్డే మనస్థత్వంఈమె సొంతం.ఈ విధంగా జర్నలిజం కుటుంబంలో ఒక ప్రముఖ జర్నలిస్ట్‌కు కుమార్తెలుగా మీడియా రంగంలో వారికంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకున్నారు ఈ ఇద్దరు సోదరీమణులు. వృత్తిని, ప్రవృత్తినీ కలబోసుకుంటూ వాళ్ళు ఎంచుకున్న రంగంలో దూసుకుపోతున్నారు. తోటివారికి అండగా కూడా నిలబడాలనే ఉద్దేశ్యంతో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొని వారి అమూల్య సేవలు అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles