Indian freedom fighter kamala nehru

Kamala Nehru Biography - Kamala Nehru

The wife of one of India's most popular leaders, Kamala Nehru held her own ground and contributed in her own way towards the independence of the country. Know more about her with this biography

Indian Freedom Fighter Kamala Nehru.gif

Posted: 05/29/2012 12:33 PM IST
Indian freedom fighter kamala nehru

Indian_Freedom_Fighter_Kamala_Nehru

Kamala-nehruభారతరాజకీయంలో, స్వాతంత్య్రోద్యమంలో నెహ్రూ కుటుంబం పాత్ర కీలకమైంది. బ్రిటిష్‌ వారు దేశాన్ని విడిచి వెళ్ళాక దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి తరతరాలుగా వారు కృషి చేస్తూనే ఉన్నారు. జాతీయోద్యమం మంచి ఊపులో ఉన్న సమయంలో వివిధ ఉద్యమాలలో భర్త జవహార్‌ లాల్‌ నెహ్రూ పోత్సాహంతో కమలా నెహ్రూ చురుగ్గా పాల్గొన్నారు.మహిళా శక్తిని సంఘటితం చేసి సహాయ నిరాకరణోద్యమం వంటి ఉద్యమాలలో ముందుండి నడిపించారు

దేశానికి తొలి ప్రధానమంత్రి, స్వాతంత్రోద్యమ నాయకుడెైన జవహార్‌ లాల్‌ నెహ్రూ సతీమణి కమలా నెహ్రూ. ఆమె 1916 ఫిబ్రవరి 7న నెహ్రూను వివాహం చేసుకున్నారు. దేశాభి వృద్ధికి కృషిచేసిన నాయకుడికి భార్యగా కాకుండా ఆమెను జాతి స్వాతంత్య్రం కోసం కృషి చేసిన వీర వనితగా పోల్చవ చ్చు. జాతీయోద్యమంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, వారిని ప్రేరేపించడంలో ఆమె చేసిన కృషి స్ఫూర్తిదాయకం.

బాల్యం

కమలా నెహ్రూ 1899 ఆగస్టు 1న కాశ్మీరుకు చెందిన సంప్రదా య బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె జన్మించడానికి ముందే తల్లిదండ్రులు ఢిల్లీకి మకాం మార్చారు. చిన్ననాటి నుం చే కమలా చాలా మృధు స్వభావి. ఎలాంటి ఆడంబరాలకు తావులేకుండా ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునే వ్యక్తిత్వం ఆమెకు చిన్న నాడే అలవడింది. నెహ్రుతో వివాహం తరువాత ఆయన జీవనశెైలితో సర్దుబాటు చేసుకోవడానికి కొంత కాలం పట్టింది. పాశ్చాత్య-దేశీయ ఆచారాలలో రెండింటిలోని మంచి ని స్వీకరించాలనేది నెహ్రూ భావన. అయితే కమలా మాత్రం వాటిని సులువుగా గ్రహించడానికి సుముఖత చూపించే వారు కాదు . వీలయినంత వరకు కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యతనిచ్చేవారు.

కుటుంబ జీవితానికి ప్రాధాన్యత

ఉత్తర భారతదేశంలో, భారతదేశానికి మకుటంమైన కాశ్మీర్‌లో జవహార్‌మాల్‌ కౌల్‌, రాజ్‌పతీ దంపతులకు జన్మించారు కమలా నెహ్రూ.చంద్‌ బహాదూర్‌ కౌల్‌, కైలాస్‌ నాథ్‌ కౌల్‌ అనే ఇద్దరు సోదరులుతో పాటు స్వరూప్‌ అనే ఒక సోదరి ఆమె తోబు ట్టువులు. 1917 నవంబర్‌లో కమలా ఇందిరా ప్రియదర్శినికి జన్మనిచ్చింది. ఇందిరా తరువాత కాలంలో ఇందిరా గాంధీగా, భారతదేశ తొలి మహిళా ప్రధానిగా గుర్తింపు సాధించింది.

ఒక విషాదం

నెహ్రూ దంపతుల జీవితంలో 1924లో ఒక పెను విషాదం చోటు చేసుకుంది. ఆ సంవత్సరం ఆమెకు ఒక పిల్లాడు పుట్టా డు. కానీ పుట్టిన రెండు రోజుల్లోనే చనిపోవడం వారిని తీవ్రం గా కలచివేసింది. మహాత్మా గాంధీ ఆలోచనలకు ప్రభావితమైన కమలా చాలా సమయం ఆయన ఆశ్రమంలోనే మిగతా వ్యక్తుల తో సమానంగా ఉంటూ గడిపే వారు.1936 ఫిబ్రవరి 28న ట్యూబర్‌క్యులోసిస్‌ అనే వ్యాధికి చికిత్స పొందుతూ స్విట్జర్లాండ్‌ లో కన్ను మూశారు. ఆ సమయంలో ఆమె పక్కన ఇందిరతో పాటు ఆమె అత్తయ్య కూడా ఉన్నారు. ఆమె సేవలకు ప్రతీకగా ను కమలా నెహ్రూ కళాశాలతో వంటివి స్థాపించారు.

Kamala_Nehru1స్వదేశీ ఉద్యమంలో...

దేశీయ వస్తువులను వినియోగించి కుల వృత్తులతో జీవితాన్ని సాగిస్తున్న వారిని సహకరించేలా ప్రేరేపించారు. ప్రజలను రెచ్చగొటే ప్రసంగం చేయనున్నాడనే సాకుతో బ్రిటిష్‌ ప్రభుత్వం నెహ్రూను అరెస్ట్‌ చేసింది. దీంతో ఆయన రాసిన ప్రసంగ పత్రంలోని అంశాల్ని స్వయంగా కమలా చదివి ప్రజలకు వినిపించారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆమెను బ్రిటిష్‌ ప్రభుత్వం రెండు సార్లు అరెస్ట్‌ చేసింది.కమలా ఉద్యమ స్ఫూర్తితో వేలాది సంఖ్యలో మహిళలు జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

ఉద్యమానికి చేయూతగా...

జాతీయోద్యమంలో ప్రముఖ నేతలంతా పాల్గొనటం, ప్రజలు కూడా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు రావడంతో ఆమె కూడా ఉద్యమంలో భాగం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. భర్త నెహ్రూతో పాటు వివిధ ప్రాంతాలకు తోడుగా వెళ్లడం అక్కడి మహిళలను ప్రోత్సాహించడం చేసేవారు. 1921లో జరిగిన సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాలొన్నారు. ఉద్యమంలో భాగంగా అలహాబాద్‌లోని మహిళలను సమూహపరిచి మద్యం షాపులను, విదేశీ వస్త్రానలు బహిష్కరించారు.

ప్రొఫైల్

పూర్తి పేరు     : కమలా నెహ్రూ

Kamala_Nehru2

పుట్టిన తేది    : 1899 ఆగస్టు 1

జన్మస్థలం      : ఢిల్లీ

భర్త             : జవహార్‌ లాల్‌ నెహ్రూ

సంతానం       : ఇందిరా ప్రియదర్శిని
వృత్తి            : స్వాతంత్య్ర ఉద్యమ నాయకురాలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mogalirekulu bindu naidu interview
Comedian sri laxmi interview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles