Interview with vidya balan

Interview With Vidya Balan, Vidya Balan Interview, Vidya Balan, Vidya Interview, Bollywood Star, Interview

Interview With Vidya Balan, Vidya Balan Interview, Vidya Balan, Vidya Interview, Bollywood Star, Interview

Interview With Vidya Balan.GIF

Posted: 03/09/2012 04:15 PM IST
Interview with vidya balan

Vidyabalan4

Vidyabalanసినిమా ఇండస్ట్రీలో ప్రారంభం నుంచే కథానాయకుల పాత్రకు ప్రాధాన్యత ఉండేది. మధ్యలో సీతా-గీతా వంటి చిత్రాలతో కథానారుుకలు కూడా లీడ్గరోల్స్‌ కనిపించారు. మళ్లీ చాలా కాలం తరువాత విద్యాబాలన్‌ నోవన్‌ కిల్డ్‌ జస్సికా, ది డర్టీ పిక్చర్స్‌ వంటి చిత్రాలలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. త్వరలో విడుదలకానున్న ‘కహానీ’ అనే చిత్రంలో గర్భిణీ స్త్రీ పాత్రలో కనిిపించనుంది కూడా.కథానారుుక ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు మంచి కాలాన్ని తీసుకొచ్చారు. ఇలా కొన్ని చిత్రాలు చేసినా నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో నటించడం విద్యా ప్రత్యేకత...సినిమాలో సినిమా... ఆ సినిమాలో మరో సినిమా. ఎంత కన్‌ఫ్యూజ్‌గా ఉంది ఇది. సినిమాలో పాత్ర. ఆ పాత్రలో మరో పాత్ర. ఇది కూడా కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంది కదూ? ఇది విద్యాబాలన్‌ నటించిన ‘భూల్‌భులయ్యా’ చిత్రంలో విద్యా పాత్ర గురించి. ఈ చిత్రంలో డిసోషియేట్‌ ఐడెంటిటీతో బాధపడే అవనీ పాత్రలో కనిపిస్తుంది విద్యా. అవనీ పాత్ర వరకు బానే ఉంది.సినిమా మధ్యలో అవనీ..మంజులికా అనే దెయ్యంగా మారిపోతుంది.ఇది చూసిన బాలీవుడ్‌ ప్రేకులు థ్రిల్‌ అయ్యారు. ఇలాంటి వైవిధ్యమైన పాత్రలను చేయడం విద్యాబాలన్‌ప్రత్యేక.

కెరీర్‌ :

కేరళలోని పలక్కాడ జిల్లాలో ఒట్టపాళమ్‌లో జన్మించిన విద్యాబాలన్‌ కుటుంబ సభ్యులు ఇంట్లో తమిళం, మలయాలం, హిందీ, ఇంగ్లిష్‌ , బెంగాలీ భాషలలో కూడా మాట్లాడేవారు.ముంబై, చెంబూర్‌లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాక నటనపై ఉన్న ఆసక్తితో ప్రయత్నాలు ప్రారంభించారు. కొంత కాలం తరువాత మోహన్‌లాల్‌ ‘చక్రం’లో అవకాశం వచ్చింది. ఎవో కారణాల వల్ల ఈ చిత్రం ప్రారంభకాలేదు.ఇంతలోనే ‘రన్‌ అనే చిత్రంలో అవకాశం వచ్చి వెళ్లిపోయింది. కొంత కాలం గ్యాప్‌ వచ్చింది. చివరికి ‘భాలో థేకో’ అనే బెంగాలీ చిత్రంలో నటించి మంచి గుర్తింపు సాధించి ‘పరిణిత’ అనే హిందీ సినిమా ఛాన్స్‌ దక్కించుకుంది.

గురు

మణిరత్న తెరకెక్కించిన ‘గురు’ చిత్రంలో విద్యా అంగ వైకల్యం ఉన్న పాత్రలో కనిపిస్తుంది. వ్యాపార వేత్తగా ఎదగాలని భావించిన గురుభాయి (అభిషేక్‌ బచ్చన్‌) అంటే చిన్న పిల్లగా ఉన్నప్పటినుంచి విద్యాకు ఇష్టం, అభిమానం ఉంటుంది.జర్నలిస్ట్‌గా గురుభాయి చేసే పనులను ప్రజలకు వివరించే ప్రయత్నంలో మాధవన్‌ కనిపిస్తాడు. మాధవన్‌ చివరికి విద్యాను పెళ్లి చేసుకుంటాడు.వీల్‌ చెయిర్‌కే పరిమితమైన విద్యా పాత్రకు మంచి గుర్తింపు లభించింది.

కహానీVidya_1

సుజోయ్‌ ఘోష్‌ తెరకెక్కిస్తున్న ‘కహానీ’ చిత్రంలో విద్యా పూర్తిగా విభిన్న పాత్రలో కనిపించనుంది.లండన్‌కు చెందిన ఒక వివాహ మహిళ పాత్రలో నటిస్తోంది. తన భర్తను వెెదుక్కుంటూ కలకత్తా నగరానికి చేరుకుని అక్కడ ఆమె పడే పాట్లే ఈ చిత్ర కథాంశం. పూర్తి చిత్రంలో ఆమె ఒక గర్భిని స్ర్తీ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే విడుదలైన ట్రెయిలర్స్‌ మంచి ఆదరణను సంపాదించాయి.

పా

ఇందులో ప్రోగేరియా అనే వ్యాధితో బాధ పడుతున్న పిల్లవాడికి తల్లి పాత్రలో కనిపించింది విద్యా. ఈ వ్యాధి వస్తే వయసు పైబడిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చిన వ్యక్తులు 20 సంవత్సరాలు తిరగకముందే చనిపోయే అవకాశాలు అధికం. అలాంటి వ్యాధతో బాధపడుతున్న ఔరో (అమితాబ్‌ బచ్చన్‌) కు తల్లి పాత్రలో విద్యానటనకు మంచి మార్కులే పడ్డాయి.

పరిణిత

1914లో ప్రముఖ బెంగాలీ రచయిత శరత్‌ చ్రంద చటోపాధ్యాయ్‌ ‘పరిణిత’ అనే పుస్తకం ఆధారంగా ఈ కథ ను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శేఖర్‌ (సైఫ్‌ అలీ ఖాన్‌) అనే గాయకుడిని ప్రేమించే పాత్రలో విద్యాకనిపిస్తుంది. చివరికి ఎన్నో మలుపులు తిరిగి కథ సుఖాంత మౌతుంది. ఇది విద్యా రెండవ చిత్రం, మంచి నటిగా గుర్తింపు తెచ్చిపె ట్టిన చిత్రం. తొలి ఫిలింఫేర్‌ అవార్డును తెచ్చిపెట్టిన చిత్రం.

విద్యాబాలన్‌ Vidya_3

అందంతో, నృత్యంతో అలరించిన సిల్క్‌ స్మితా పాత్రలో కనిపించి అలరించిన విద్యాబాలన్‌ కెరీర్‌లో చేసిన చిత్రాల లో చాలా శాతం వైవిధ్యకథాంశంతో వచ్చినవే. లగే రహో మున్నా భాయి చిత్రంలో ఆర్‌.జేగా, కిస్మత్‌ కనెక్షన్‌లో కథానాయకు డికి అదృష్టాన్ని తీసుకొచ్చే వ్యక్తి పాత్రలో కనిపించింది. భవిష్యత్తులో విద్యాబాలన్‌ జీవితంపై ఒక సినిమా రావొచ్చు. ఎమో! చెప్పలేము.

ది డర్టీ పిక్చర్‌

ప్రతి నటి జీవితంలో ఒక చిత్రం హైలైట్‌గా నిలుస్తుంది. విద్యాబాలన్‌ ‘ది డర్టీ పిక్చర్‌’ చిత్రం ఈ ఘనతను సాధించిపెట్టింది. సిల్‌ స్మిత జీవితగాథ ఆధారంగా ఏక్తా కపూర్‌ రూ.20 కోట్లతో తెరెక్కించిన ఈ చిత్రం దాదాపు రూ.117 కోట్లను రాబట్టింది.ఈ చిత్రంలో కథానాయిక విద్యాబాలన్‌, హీరో ఆమె నటన. ఇంతలా గ్లామరస్‌ పాత్రలో చేయడానికి విద్యా చేయడానికి ఒప్పుకున్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. కెరీర్‌ మంచి ఊపులో ఉన్నప్పుడు ఇలాంటి రిస్కు చేయడం అవసరమా అని అన్నారు. అందుకే ఉత్తమ నటిగా ఈ చిత్రానికి ఫిలింఫేర్‌ అవార్డు కూడా అందుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Desicrew solutions pvt ltd is a rural bpo company
Actress nirosha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles