Actress nirosha

New Mp3 Songs,download songs,Latest Telugu mp3 Songs,Tollywood Songs Lyrics,Telugu new releases,Song Lyrics,Lyrics in Telugu,Telugu songs,telugu music,telugu movies,telugu mp3,hindi songs download,Telugu Devotional songs,Lyrics World,Online Music Site

Actress Nirosha, Naari naari naduma muraari, Manasuloni marmamulu - manasuloni marmamunu telusuko,

Actress Nirosha.gif

Posted: 03/07/2012 12:21 PM IST
Actress nirosha

Actress_Nirosha1

Actress_Niroshaప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలంటే నవ్వాలి... చూపులు రువ్వాలి... కళ్లతోనే కవ్వించాలి.... ఇంకా ఏవి చేయగలిగితే, ఎంత చేయగలిగితే అంతా చేయాలి... తెర మొత్తం మీద తమను తప్ప మరి దేన్నీ ప్రేక్షకులు చూడకూడదంటే... ఇవన్నీ తప్పదు మరి. మిగిలిన నటుల భుజస్కంధాల మీద మాత్రమే ఉండే ఈ ఆకట్టుకునే బాధ్యత హీరోయిన్స్ దగ్గరకు వచ్చేసరికి ఒళ్లంతా ఉంటుంది. ప్రేక్షకుడు తమను ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసేలా చేయడమే ఒక టాప్ హీరోయిన్ ‘ఐ’డెంటిటీ. కాని ఆ హీరోయిన్‌కు అంత అవసరం పడలేదు. ఎందుకంటే ఆమె ప్రయత్నం లేకుండానే తన నుంచి చిలిపినవ్వులు కురిసేవి... కళ్లు కవ్వించేవి... కదలికలు కళ్లను కట్టిపడేసేవి. యువతకు నిద్రను దూరం చేసేవి. పేరులోనే నిషా ఉన్న ఆ సార్థక నామధేయురాలు, ఒకనాటి తమిళ హాస్యనటుడు ఎమ్.ఆర్.రాధాకృష్ణన్ నాయుడి సంతానంలో ఒకరైన ఈ నటీమణి ఇప్పుడు కనపడదేం?

దక్షిణాది సినిమాల్లో అక్కాచెల్లెళ్లు పోటాపోటీగా రాణించిన కథలు మనకు కొత్తకాదు. అయితే క్లాసూ మాసూ తేడా లేకుండా పాత్రేదైనా పండించేసే రాధిక లాంటి పాపులర్ నటికి వారసురాలిగా ఎంట్రీ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అందుకు ఎంతో కొంత ధైర్యం ఉండి తీరాలి. అగ్నినక్షత్రం అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆ చెల్లికి తన మీద తనకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం నిజమైంది. ఒక్క తమిళంలోనే కాదు... తెలుగులో కూడా హిట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. సింధూరపువ్వు, నారీ నారీ నడుమ మురారి, స్టువర్‌‌టపురం పోలీస్‌స్టేషన్, కొబ్బరి బోండాం, హలో గురూ, ప్రియతమా, వన్ బై టూ వంటి పలు సినిమాల్లో నటించిన ఆమే... నిరోషా.చూపులకు బాగుంటే హీరోయిన్‌గా కావచ్చునేమో. కాని.. గులాబీరంగు ఒళ్లు, సరిపడా ఎత్తు, తీరైన ఫిజిక్ ఎట్సెట్రాలన్నీ ఉంటేనే ‘హాట్’ ఫేవరెట్ అవుతుంది. అయితే ఇవేవీ లేని ఒక నల్ల పిల్ల అంతటి సెక్సీ ఇమేజ్ సాధించడం అంటే వి‘చిత్రమే’. ‘ఒక బృందావనం... సోయగం... ఎద కోలాహలం... అనుక్షణం’ పాటలో తనతో పాటు ప్రేక్షకుల్ని కూడా కలల కొలనులో ఈతకొట్టించింది నిరోషా. హీరో రామ్‌కీ సరసన సింధూరపువ్వుగా తొలిసారి వికసించినా... ఆమెను కుర్రకారు క్రేజీగాళ్‌గా మార్చింది మాత్రం మణిరత్నం ‘ఘర్షణ’ సినిమా. తనకు మాత్రమే ప్రత్యేకమైన అందంతో ఆ సినిమాలో మెరిసి యూత్‌కు క్రేజీగా మారిన నిరోషా... ఆ తర్వాత చిరంజీవి, మోహన్‌బాబు, బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్... వంటి హీరోల సరసన వరుసపెట్టి అవకాశాలు దక్కించుకుంది. చివరగా 1992లో డిటెక్టివ్ నారదలో నటించి... అవకాశాలు రాకో, అవసరం లేకో గాని ఆ తర్వాత మనకు కనపడలేదు. ఏమైపోయిందీ ‘మహాజనానికి మరదలు పిల్ల?’

ప్రేమలో గెలిచి... జీవితంలో ఓడింది…

తొలి హీరోనే నిజజీవితపు హీరోగా సుదీర్ఘకాలం ప్రేమించిన నిరోషా తన వలపును పండించుకుంది. వలచి వలపించుకున్నరామ్‌కీనే పెళ్లాడి, చెన్నైలోనే సెటిలయింది. అయితే తెలుగు, తమిళం రెండింటిలోనూ కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న ఈ బ్లాక్‌బ్యూటీ తప్పు చేశానని ఇప్పుడు తీరిగ్గా చింతిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే... పెళ్లి ఆమె అవకాశాలకు పూర్తిగా గండికొట్టింది. పెళ్లయ్యాక ఇంటికే పరిమితమైన నిరోషా... అనూహ్యంగా రామ్‌కీ సినీ కెరీర్ ఒడిదుడుకుల్లో పడడంతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. వీటిని ఎదుర్కోవడానికి వివాహానంతరం కొంత గ్యాప్ తర్వాత సినిమాల్లో నటనకు సై అన్నా... ఒకటీ అరా తమిళ సినిమాలే ఆమెను పలకరించాయి. ఏదో ఒకటిలే అనుకుని 2006 దాకా లాక్కొచ్చినా, మరీ లావెక్కడం వల్ల కాబోలు... పలు తమిళ టీవీ సీరియల్స్‌లో భయపెట్టే క్యారెక్టర్లే తప్ప ఇతర పాత్రలకు పెద్దగా డిమాండ్ రాలేదు. దాంతో తెరమరుగవక తప్పలేదు.

ఫలితం... నలభై రెండేళ్ల వయసులో ప్రస్తుతం నిరోషా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవు తున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత రెస్టారెంట్ వ్యాపారంలోనూ కలిసి రాక ‘సింధూరపువ్వు’ జంట అప్పుల ఊబిలో కూరుకుపోయారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం అంతకంతకూ పెరిగిపోవడంతో చెన్నైలో వీరికి ఉన్న ఆస్తుల్ని జప్తు చేసే పరిస్థితి వచ్చింది. వీరి ఇంటిని సైతం బ్యాంకులు వేలానికి పెట్టినట్టు సమాచారం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఇల్లాలికి, అందం ఉండగానే అంతస్థులు సమకూర్చుకోవాలని హీరోయిన్లకి ఒకరు చెప్పాల్సిన పనిలేదంటారు. కాని నిరోషా లాంటి తారలను చూస్తే చెప్పక తప్పదేమో అనిపిస్తుంది. టీనేజీ కుర్రకారు కలల సింహాసనాన్ని కొన్నేళ్ల పాటు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన ఈ డ్రీమ్‌గాళ్ ఎదుర్కొంటున్న ఈ కష్టాలు త్వరలోనే పీడకలల్లా తేలిపోతాయని, ఆమె ఈ ఒడిదుడుకుల నావను విడిచి త్వరలోనే ఒడ్డుకు చేరుకుంటుందని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Interview with vidya balan
Interview with singer usha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh