Great actress mahaa nati savitri jayanthi today 06th dec

Savitri,Jayanthi,Today,06th,Dec,2011, Bollywood Trailer, Kollywood Trailer, Tollywood Trailer, Hindi Trailers, Tamil Trailers, Telugu Trailers, Malayalam Trailers, Kannada Trailers, Desi Comedy Videos, Desi Fun Videos, Desi Entertainment Videos, Indian Fashion Videos, Desi Music Videos, Indian Cultural Videos, Cricket Video, Indian Sport Videos, Indian Travel Videos, Desi Cooking Videos, Indian Recipe Videos, Indian Cooking, Bollywood Promo Videos, Tamil Movie Promos, Telugu Movie Promo

Veteran Telugu director-producer-actor-politician Dasari Narayana Rao will release a biography on legendary actress Mahanati Savitri, one of the best actresses of all time, during his 63th birthday celebrations to be held at Ravindra Bharati.

Savitri Jayanthi 06th Dec.GIF

Posted: 12/06/2011 12:48 PM IST
Great actress mahaa nati savitri jayanthi today 06th dec

Savitri_Jayanti

సినీ ప్రపంచంలో ఎందరో నటీమణులు తెరమీద తళుక్కున మెరిసి కనుమరుగవుతున్నా.... ఎప్పటికీ అందరి మనసుల్లో చెరగని ముద్రSavitri_1 వేసుకున్న నటీమణి సావిత్రి. మహానుభావులకు మరణం లేదంటారు. అందుకే సినీ పరిశ్రమల నేటికీ ఓ ద్రువ తారగా వెలుగుతూ నూతన నటీమణులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు సావిత్రి. ఆ మహానటి సావిత్రి జయంతి నేడు.

అందానికి అందం నీవే పుత్తడి బొమ్మఅని సినీకవి చెప్పిన అక్షర వర్ణన మహానటి సావిత్రికి సగిగ్గా సరిపోతుందేమో. ఆమె నటనకే ఒక గీటు రాయి. నిబద్దతకు స్పష్టమైన అర్థం. నిశ్శంకర రావుగురవయ్య, సుభధ్రమ్మలకు గుంటూరు జిల్లా తెనాలి చిర్రాపూరులో డిసెంబర్ 6, 1935లో జన్మించింది. అతి చిన్న తనం నుంచే సంగీతం, సాంప్రదాయ సంగీతం, నుత్యాలను శిష్టాపూర్ణయ్య శాస్త్రి వద్ద నేర్చుకుంది. ఆమె బాల్యం నుంచే స్టేజిషోలు ఇచ్చేది. తెలుగు, తమిళ కన్నడ బాషల్లో నటించి తన నటనతో ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసింది. ఆమె మొత్తం 318 సినిమాల్లో నటించింది. చైల్డ్ ఆర్టిస్టుగా విజయవాడలో తన కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత సొంతంగా నవభారత నాట్య మయూరి అనే సంస్థను స్థాపించింది. బుచ్చిబాబు రచించిన ఆత్మవంచనఅనే నాటికలో నటించి ఉత్తమ నటిగా పేరు సంపాదించుకుంది.

సినీ రంగ ప్రవేశం...

ఆమె తొలి చిత్రం సంసారం. తదుపరి రెండవ నాయికగా 1952లో ఎల్.వి. ప్రసాద్ నిర్మించిన పెళ్ళ చేసి చూడుచిత్రంలో నటించింది. చంద్రహారం, దేవదాస్, అర్థాంగి, మిస్సమ్మ, దొంగ రాముడు, అమర దీపం లాంటి ఎన్నో గొప్ప సినిమాల్లో నటించి తన అసమాన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. తమిళంలో శివాజీ గణేశన్, ఎమ్.జి.ఆర్, రామచంద్రన్ లాంటి గొప్ప నటులతో నటిచింది. 1953లో మానం పోల మాంగల్యంఅనే తమిళ సినిమాలో శివాజీ గణేశతో నటించింది. సావిత్రి నూరవ చిత్రం కొంజుమ్ సాలరంగి’ (తెలుగులో మురిపించే మువ్వలు) పొసమలార్ అనే చిత్రంలో శివాజీ గణేశన్ చెల్లెలుగా నటించి ఆ చిత్రాన్ని నెంబర్ వన్ గా నిలిపి సినీ పరిశ్రమకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

హిందీ సినిమా రంగ ప్రవేశం....

ఈ అందాల ముద్దు గుమ్మ సావిత్రి బాలీవుడ్ లో కూడా నవరసాల్ని పండించింది. బహుత్దాహవే, ఘర్, బస్ కే దేఖో, శ్రీక్రిష్ణ, బలరాం, గంగాకిలహెరెన్ లాంటి గొప్ప సినిమాల్లో నటించి నిర్మాతలకు కనక వర్షం కురిపించి బాలీవుడ్ రంగాన్ని ఊపు ఊపిన బ్యూటీ క్వీన్ ఈమె.

దర్శకురాలిగా....

సావిత్రి ఓ గొప్ప మహానటినే కాక డైరెక్టర్ గా , నిర్మాతగా, మంచి పేరు సంపాదించుకుంది. తెలుగులో ఈమె దర్శకత్వం చేసిన సినిమాలు 1968లో చిన్నారి పాపలు, ఇంకా చిరంజీవి, మాత్రుదేవత, వింత సంసారం, అలాగే తమిళంలో కూడా కుజంతామ్ ఉల్లమ్, ప్రాప్తమ్ వంటి సూపర్ హిట్ సినిమాలకు తన దర్శకత్వ ప్రతిభను కనబరిచి మంచి పేరు సంపాదించుకుంది.

సేవలో మిన్న....

ఆమె సమాజ సేవా కార్య క్రమాల్లో కూడా పాల్గొనేది. అప్పట్లో ప్రధాన మంత్రి లాల్ బహుదూర్ శాస్ర్తి గారిని కలిసి తన ఆభరణాలన్నించిని ప్రధాన మంత్రి సహాయ నిధికి అందించింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో హై స్కూల్ కూడా నిర్మించింది.

Savitri_2వ్యక్తిగత జీవితం....

ఆమె 1955లో జెమినీ గణేష్ ను వివాహం చేసుకుంది. ఆమెకి ఇద్దరు పిల్లలు. విజయ ఛాముండేశ్వరి, సతీష్ కుమార్. తల్లిగా ఆమె సక్సెస్ అయినట్లే. 1960లో విడుదలైన చివరికి మిగిలేదిసినిమాకు రాష్ట్రపతి నుండి ఉత్తమ నటి అవార్డును, తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమామణి అవార్డును అందుకుంది. ఆంధ్ర ప్రదేశ్ నుండి నట శిరోమణి, తమిళనాడు నుండి ఉత్తమ ప్రతిభకు నడియార్ తిలకమ్ అనే బిరుదును అందుకుంది. ఆమె చివర్లో సంపారజీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎర్కొని, ప్రేక్షకుల్ని తన నటనతో సమ్మోహితుల్ని చేసి అతి చిన్న వయస్సులోనే తన 46వ ఏట డిసెంబర్ 26వ తేదీ 1981న పరమదించి సినీ పరిశ్రమకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది.

ఆమెకు ఆంధ్ర విశేష్ ఘన నివాళలు అర్పిస్తూ........

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jyoti amge named world record
Rocket woman tessy thomas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles