Rocket woman tessy thomas

Tessy Thomas, Agni-II, Agni missile, Scientis, AGNI, MISSILE, RE-ENTRY, VEHICLE, RVS, PEOJECT, DIRECTOR, TESSY THOMAS, DRDO,

Tessy Thomas has virtually blasted her way through it. The 48-year-old is the first-ever woman director of an Indian missile project and is set to place India in an elite club of nations like the US, Russia and China with the capability to produce their own long-range Inter-Continental Ballistic Missiles.

Rocket woman Tessy Thomas.gif

Posted: 11/30/2011 03:04 PM IST
Rocket woman tessy thomas

Rocket_woman_Tessy_Thomas2

ఈ నెల 15వ తారీఖున బాలాసోర్ ప్రాంతంలో విజయవంతమైన అగ్ని – 4 ప్రాజెక్టును విజయం వంతం చేసి, ఈ విజయం కీలకపాత్ర పోషించి అగ్ని పుత్రికగా పేరొందిన టెస్సీ థామస్ గురించి ఈ వారం స్పెషల్....

భారతదేశ రక్షణకు అత్యాధునిక ఆయుధాలను అందించటంలో పురుషులే కాదు. మహిళలు సైతం ముందుండ వచ్చని నిరూపించారు హైదరాబాద్ కి ఢిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్ డీఓ) ప్రాజెక్టు డైరెక్టర్ టెస్సీ థామస్. అగ్ని క్షిపణుల రూపకలప్పనకు ఉద్ధేశించిన డీఆర్ డీవో ప్రాజెక్టులో సాధారణ శాస్త్రవేత్తగా చేరిన ఈమె స్వయం శక్తితో ప్రతిష్టాత్మకమైన అగ్ని ప్రాజెక్టు డైరెక్టర్ గా ఎదిగారు. ఇటీవల అగ్ని – 4 ప్రాజెక్టును ప్రయోగించడటంతో విజయవంతమైన ఈమె, 5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగల ఖండాంతర ప్రాజెక్టుల్లో చురుకుగా పనిచేసి మొట్టమొదటి మహిళా అగ్ని ప్రాజెక్టు డైరెక్టర్ గా ఎదగటం తో పాటు ఎన్నో వరుస విజయాలు సాధించారు.

పట్టుదలగా....

పట్టుదల, ఆత్మవిశ్వాసం, అంకిత భావం, కష్టపడేతత్వం ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చనటానికి నిదర్శనంగా నిలిచారు. అగ్నిపుత్రిక టెస్సీ థామస్, కేరళ రాష్ట్రంలోని అలెప్సీ గ్రామానికి చెందిన టెస్సీ థామస్ కోజికోడ్ లోని త్రిసూర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదివారు. ఆ తర్వాత డీఆర్ డీవో స్పాన్సర్ చేసిన గైడెడ్ మిస్సైల్స్ లో ఎంటెక్ కోర్సు పూర్తి చేశారు. అనంతరం రక్షణ రంగ పరిశోధనలపై ఆసక్తితో ఆమె డీఆర్ డీఓలో శాస్త్రవేత్తగా చేరారు. చదువులో అత్యంత ప్రతిభ కనబర్చిన ఈమె పరిశోధన రంగంలో పలు విజయాలకు శ్రీకారం చుట్టారు.

అంచెలంచెలుగా ఎదిగి...

టెస్సీ థామస్ స్వయం శక్తితో సామాన్య శాస్త్రవేత్త నుండి అంచెలంచెలుగా ఎదిగారు. డీఆర్ డీఓ శాస్త్రవేత్తగా చేరిన టెస్సీ థామస్ కి అప్పటి క్షిపణి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం పరిశోధన రంగంలో భాగంగా అగ్ని ప్రాజెక్టుల రూపకల్పనలో అవకాశం ఇచ్చారు. అగ్ని – 2 పరిశోధనలో చురుకుగా పనిచేసిన ఈమెకు అగ్ని – 3 ప్రాజెక్టు అసోసియేట్ ప్రాజెక్టు డైరెక్టర్ గా పనిచేసే అవకాశం లభించింది. ఈ ప్రాజెక్టులో ఆమె కీలక పాత్ర పోషించారు.

3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేధించగలిగేలా అగ్ని – 3 ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. అగ్ని క్షిపణులకు కావాల్సిన ఇంధనమైన సాలిడ్ ప్రొపెల్లెంట్స్ ను కనుగోవడంలో టెస్సీ హైదరాబాద్ లోని లాబోరేటరీలో అత్యాధునిక విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2009వ సంవత్సరంలో అగ్ని – 4 ప్రాజెక్టు డైరెక్టర్ గా మొదటిసారి మహిళకు అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అగ్ని – 4 క్షిపణి మొదటి సారి ప్రయోగంలో విఫలమైనా కలత చెందకుండా మరింత పట్టుదలగా ఈనెల 15 తేదిన ఒరిస్సా తీరంలో జరిపిన పరీక్షల్లో విజయం సాధించారు. అగ్ని – 4 సాధించిన విజయంతో మరో అడుగు ముందుకు వేసి అగ్ని – క్షిపణి రూపకల్పనలో టెస్సీ థామస్ నిమగ్నమయ్యారు.

ఎన్నో అవార్డులు AGNI5

అగ్ని పుత్రికగా పేరొందిన మొట్టమొదటి మహిళా డీఆర్ డీఓ అగ్ని – 5 ప్రాజెక్టు డైరెక్టర్ టెస్సీ థామస్ కి పలు అవార్డులు, ప్రశంసలు లభించాయి. అగ్ని క్షిపణులను రూపొందించడంలో కీలకపాత్ర వహించిన ఈమె కు సాక్షాత్తు ప్రధానితో పాటు, పలువురు మంత్రులు, ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. డీఆర్ డీఓ క్షిపణుల ప్రయోగాలు సక్సెస్ అయినప్పుడల్లా ఈమెకు పలు అవార్డులు లభించాయి. గత సంవత్సరం దేశ రక్షణశాఖ మంత్రి ఎ.కె. అంటోని నుంచి ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న కొత్త సవాళ్ళకు అనుగుణంగా దేశ రక్షణకు పదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం ఛేదించగల క్షిపణులను పూర్తి స్వదేశీ సాంకేతికతో తయారుచేయాలని యోచిస్తున్నారు. రక్షణ పరిశోధన రంగ పరిశోధనల భావి లక్ష్యాలు నెరవేరి, ప్రపంచంలోనే మన దేశం క్షిపణుల తయారీలో అగ్రభాగానా నిలవాలని మన అందరం కోరుకుందాం...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Great actress mahaa nati savitri jayanthi today 06th dec
Soniyaghandi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles