వస్తున్నా...మీకోసంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు పలువురు మహిళలు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. దాంతో ఆయన అధికారంలోకి వస్తే అందరి సమ్యలు తీరుస్తానంటూ భరోసా ఇచ్చారు. జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించగానే కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పులిగడ్డ-పెనుమూడి వారధి మీదుగా చేరుకోగా, ఇరువైపులా బారులుతీరిన మహిళలు బాబును కలిసి సమస్యలు విన్నవించారు. బాబు ప్రజల సమస్యలను ఆలకించి వారికి భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. గ్యాస్ ధరలు పెరగడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నామనీ, మద్యపానాన్ని నిషేధించాలనీ, డ్వాకా గ్రూపుల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారనీ, సబ్సిడీ నగదు బదిలీ వద్దని...నగదు బదిలీ అమలుచేస్తే మా మగవాళ్ళు తాగితందనాలు ఆడతారుతప్పితే ఉపయోగం ఉండదంటూ పలువురు మహిళలు విన్నవించారు. విద్యార్ధినిలను చూసి ఆగిన బాబు వారికి కరచాలనం చేసి కుశల ప్రశ్నలు వేశారు. బాగా చదువుతున్నారా.. అంటూ ముందుకు సాగారు. దివిసీమ పాలిటెక్నిక్ విద్యార్థులు చంద్రబాబునుకలిసి స్కాలర్‌షిప్ సమస్యలు తెలిపారు. ఓసీలకు స్కాలర్‌షిప్‌లు అందడంలేదని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సైతం సరిగా రావటంలేదన్నారు. అవనిగడ్డ-రేపల్లె బస్సు సర్వీసు లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గుంటూరు నాంచారయ్య నేతృత్వంలో పలువురు ఎస్సీ వర్గీకరణ వద్దనీ, సమైక్యమే ముద్దని నినాదాలు చేయగా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు, టీడీపీ కార్యకర్తల రాకను చూసి పోలీసులు వారిని పంపించివేశారు.
మత్య్సకారులకు ప్ర జాప్రతినిధులుగా తగినంత గుర్తింపు రావటంలేదనీ, ప్రాతినిధ్యం కల్పించాలని లకనం నాగాంజనేయులు వినతిపత్రం అందజేశారు. అవనిగడ్డ సీబీఎం బోర్డింగ్‌స్కూల్ ఆక్రమణకు గురైందంటూ పాస్టర్ దేవదానం, డి.మోజెస్, డి.కాంతారావు వినతిపత్రం అందజేశారు. ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ పోరాటసమితి నేతలు పఠాన్ కరీముల్లాఖాన్, షేక్ నబీఘోరి ముస్లింల సమస్యల పరిష్కారించాలంటూ వినతిపత్రాలు అందజేశారు. మహిళల ఇబ్బందులను సావధానంగా ఆలకించిన చంద్రబాబు అన్నీ సమస్యలే...టీడీపీ అధికారంలోకి వస్తే పరిష్కారం అవుతాయన్నారు. ధరలు, విద్యుత్‌ఛార్జీల పెంపు, గ్యాస్‌ధరలు, మద్యపాన నిషేదం ఇలా ప్రతి అంశాన్ని చంద్రబాబు ఆలకించారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more