Tenali international film festival

tenali international film festival, film festival, film fete, tenali film fete, flim celebrations, tenali, andhra pradesh, d ramanaidu, justice chalameswar, kondavalasa,relangi narsimharao

tenali international film festival

12.gif

Posted: 12/18/2012 02:32 PM IST
Tenali international film festival

tff

       తెనాలి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో రెండో అంత ర్జాతీయ చలన చిత్రోత్సవాలు 19 నుంచి తెనాలిలో నిర్వహిస్తున్నారు. నిన్న ఉత్సవాలకు సంబంధించిన స్క్రీనింగ్ షెడ్యూల్‌ను ఆవిష్కరించారు. బోస్‌రోడ్డులోని వేద డీలక్స్‌ లో నాలుగు రోజుల పాటు ప్రపంచంలోని పలు భాషలకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శిస్తారు.
       19వ తేదీ తొలి రోజు సాయంత్రం నుండి జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసన సభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ముఖ్య అతిధిగా సుప్రింకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, ఆత్మీయ అతిధిగా ప్రముఖ నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు హాజరుకానున్నారు.
      నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో సినీ ప్రముఖులు ఏవీ ఎస్, రేలంగి నరసింహారావు, చిన్నికృష్ణ, సునీల్‌కుమార్ రెడ్డి, హవీష్, రామ్‌జగన్, కొండవలస లక్ష్మణరావు తదితరులు పాల్గొంటారు. అవార్డులు అందుకుంటున్న సినీ ప్రముఖుల వివరాలు..
      ప్రముఖ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు (ఎన్టీఆర్ అవార్డ్), జయప్రకాష్‌రెడ్డి(ఎస్వీఆర్ అవార్డు), తెలంగాణా శకుంతల (సావిత్రి అవార్డు), గుండు హనుమంతరావు(అల్లురామలింగయ్య అవార్డు), జె.కె భారవి (బొల్లిముంత అవార్డు), అనంత్‌శ్రీరామ్ (వేటూరిఅవార్డు), లెనిన్(వి.మ ధుసూధనరావు అవార్డు)లను అతిధుల చేతుల మీదుగా అందుకోనున్నారు.
         ప్రదర్శించనున్న చలన చిత్రాల వివరాలు..19వ తేదీ తొలి రోజున ఉదయం 9 గంటలకు 2022 సునామి(థాయ్‌లాండ్), 11 గంట లకు ది సీక్రెట్ ఇన్ దేర్ ఐస్(అర్జెంటీనా), మధ్యాహ్నం 2 గంటలకు ది రెడ్‌స్పాట్(జర్మనీ), రాత్రి 7.30 గంటలకు ఎ సెపరేషన్ (ఇరానీ), 20న ద సోర్సీ రర్ అండ్ ది వైట్ (హాంకాంగ్- చైనా), నైట్ రెయిన్ (ఇండియా - మళయాళం), మిస్టర్ బోన్స్(సౌత్ ఆఫ్రికా), ది వైస్టిల్ బ్లోవర్ (కెనడా), అప్పర్ డాగ్ (నార్వేజ్), 21న ధర్డ్ పర్సన్ సింగ్యులర్ నంబర్ (బం గ్లాదేశ్), విముక్తి (ఇండియా - కెనడా), ది కలర్ ఆఫ్ ప్యారడైజ్ (ఇరాన్), తమిళ చిత్రం, ది ఫ్రంట్ లైన్ (సౌత్ కొరియా), 22న ది ఫస్ట్ రెయిన్స్ ఆఫ్ స్ప్రింగ్ (కజకిస్తాన్ - జపా న్), కగ్‌బెని (నేపాల్), రాప్సోడీ ఇన్ ఆగస్ట్ (జపాన్), గంగపుత్రులు (తెలుగు) చిత్రాలను ప్రదర్శిస్తారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  School syllabus change
Haj tour charges hike  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more