Forest officials seized 8 tonnes of red sandalwood at chittoor

Forest Officials seized 8 Tonnes of Red Sandalwood at Chittoor, Red Sandalwood at Chittoor, ig rajeev ratan reviews on tirumala security , Rajeev Ratan, IG, Rayalaseema region,

Forest Officials seized 8 Tonnes of Red Sandalwood at Chittoor, Red Sandalwood at Chittoor, ig rajeev ratan reviews on tirumala security

కోటిన్నర ఎర్రచందనం-ఐజీ రాజీవ్‌ రతన్‌ సమీక్ష

Posted: 10/26/2013 06:07 PM IST
Forest officials seized 8 tonnes of red sandalwood at chittoor

చిత్తూరు జిల్లాలోని వెదరుకుప్పం వద్ద అక్రమంగా తరలిస్తున్న 8 టన్నుల ఎర్రచందనాన్ని ఈ రోజు తెల్లవారుజామున పటుకున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. అందుకు సంబంధించి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నాట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకోవడం ఇదే ప్రధమం అని అటవీశాఖ అధికారులు తెలిపారు.

 

స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్ లో రూ. కోటిన్నర వరకు ఉంటుందని చెప్పారు. స్మగ్లర్లను పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. స్మగ్లర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే ఎర్రచందనాన్ని తరలించేందుకు ఉపయోగించిన వాహనాలను పోలీసు స్టేషన్ కు తరలించి సీజ్ చేసినట్లు చెప్పారు.

 

ఐజీ రాజీవ్‌ రతన్‌ సమీక్ష

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి ఆలయ భద్రతపై రాయలసీమ ఐజీ రాజీవ్ రతన్ ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతే కాకుండా శ్రీవారి ఆలయ మాడ వీధులలో భద్రతా నిర్వహణను ఆయన స్వయంగా పరిశీలించారు. అంతకు రాజీవ్ రతన్, డీఐజీ బాలకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు.

 

కాగా నవంబర్ 29 నుంచి జరగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహోత్సవాల భద్రతపై రాజీవ్ రతన్,అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ నిన్న సమీక్ష జరిపారు.ఇటీవలి చిత్తూరు జిల్లాలో ఉగ్రవాదులు పట్టుబడిన విషయం తెలిసిందే. తిరుమలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారనే నేపథ్యంలో భద్రతపై అధికారులు ప్రత్యక దృష్టి పెట్టారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles