Sri kodandaramaswami temple brahmotsavam

sri kodandarama swami, sri kodandaramaswami temple brahmotsavam, tirupathi, chakra in the kapila theertham pushkarini in tirupati, kapila theertham,

sri kodandaramaswami temple brahmotsavam

sri kodandaramaswami.gif

Posted: 03/20/2013 07:14 PM IST
Sri kodandaramaswami temple brahmotsavam

 sri kodandaramaswami temple brahmotsavam

తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి వార్షికనవాహ్నిక బ్రహ్మోత్సవాలో చివరిరోజైన కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. సందర్భంగా టిటిడి ఇ ఓ ఎల్‌ వి సుబ్రమణ్యం విలేకరులతో మాట్లాడుతూ శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజులు పాటు వైభవంగా నిర్వహించామన్నారు. తిరుపతి, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఉదయం, రాత్రి వేళ స్వామివారి వాహనసేవల్లో పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పండుగ వాతావరణంలో ఏర్పాటు చేసిన రామకోటి లేఖనం, శ్రీమద్రామాయణ గోష్టి, మహతి కళాక్షేత్రం, శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక, భక్తి సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలకు భక్తుల నుండి విశేషస్పందన వచ్చిందని వివరించారు. ఒక్కో ఆలయ బ్రహ్మోత్సవాలకు ఒక్కో ప్రాధాన్యత ఉంటుందని, అందుకే టిటిడి అనుబంధ ఆలయాల బ్రహ్మోత్సవాను ప్రత్యేక శ్రద్దతో నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

 sri kodandaramaswami temple brahmotsavam

 బ్రహ్మోత్సవాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియాకు ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. తరిగొండలోని శ్రీ లక్ష్మీనర సింహస్వామివారి ఆలయంలో మార్చి 19 నుండి 28వతేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అంతకముందు ఉదయం 7.30గంటల నుండి 10గంటల వరకు లక్ష్మణ సమేత సీతారాముల వారు పల్లకిలో కపిలతీర్థానికి వేంచేశారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అక్కడ స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాతాళ్వార్లు పాలు, పెరుగు, నెయ్యి,త పండ్ల రసాలతో అభిషేకాలు చేశారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. భక్తుల శ్రీరామనామస్మరణలతో ఆ ప్రాంతం మారుమోగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Goa governor bharat vir wanchoo visit tirupati
Brahmostavam at sri kodandarama swamy temple at tirupati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles