Brahmostavam at sri kodandarama swamy temple at tirupati

sri kodanda rama swamy , brahmostavam at sri kodandarama swamy temple at tirupati

brahmostavam at sri kodandarama swamy temple at tirupati

kodandarama-swamy.gif

Posted: 03/15/2013 08:08 PM IST
Brahmostavam at sri kodandarama swamy temple at tirupati

brahmostavam at sri kodandarama swamy temple at tirupati

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు కల్పవృక్ష వాహనంపై స్వామి వారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ఠీవీగా ముందు నడువగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామి వారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు. ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. ఇతర వృక్షాలు కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం వాంచిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని స్వామి వారు అధిరోహించి నాల్గవరోజు ఉదయం తిరుమాడ వీధుల్లో భక్తులకు తనివితీరా దర్శనమిస్తారు. వాహనసేవ అనంతరం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీకోదండరామస్వామి వారు భక్తులకు కనువిందు చేశారు. సర్వభూపాలురు అంటే అందరు రాజులు అని అర్ధం. రాజా ప్రనజారంజనాత్‌ అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. ఈ రాజులందరికీ రాజాధిరాజు భగవంతుడు. అందుకే సర్వభూపాలురు వాహన స్థానీయులై భగవంతుని తమ భుజస్కందాలపై ఉంచుకొని విహరింపజేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri kodandaramaswami temple brahmotsavam
A hair raising story of tirupathi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles