The Cooking Tips To Make Butter Garlic Fish Fry Yummy Recipe | Kitchen Tips | Cooking Tips

Butter garlic fish fry recipe cooking methods kitchen tips

butter garlic fish fry, fish fry recipes, butter garlic fish fry recipe, butter garlic fish fry cooking tips, cooking tips telugu, cooking methods telugu, kitchen tips telugu, fish fry tips, weekend recipes

Butter Garlic Fish Fry Recipe Cooking Methods Kitchen Tips : The Cooking Tips To Make Butter Garlic Fish Fry Yummy Recipe.

బట్టర్ గార్లిక్‌తో ఫిష్ ఫ్రై ఎలా చేస్తారో తెలుసా?

Posted: 09/18/2015 06:44 PM IST
Butter garlic fish fry recipe cooking methods kitchen tips

వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది. వీకెండ్ లో టేస్టీ అండ్ రిసిపీని చేసుకోవాలంటే.. బట్టర్ గార్లిక్ తో ఫిష్ ఫ్రైట్ చేయడం ఎంతో శ్రేయస్కరం. ఈ రిసిపీ టేస్టీగా వుండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాల్ని కలిగిస్తుంది. అల్లం బరువును నియంత్రిస్తే.. చేపలు గుండె జబ్బుల్ని నివారిస్తాయి. ఇక వెన్న క్యాన్సర్‌ను, గుండె సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగే ఈ మూడింటి కాంబినేషన్‌లో బట్టర్ గ్లారిక్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం..

కావలసిన పదార్థాలు :

చేప ముక్కలు : ఒక కేజీ
మైదా : రెండు టేబుల్ స్పూన్లు
కార్న్ ఫ్లోర్ : రెండు టేబుల్ స్పూన్లు
వెన్న : ఐదు టేబుల్ స్పూన్లు
బేకింగ్ పౌడర్ : ఒక టేబుల్ స్పూన్
వెలుల్లి, కొత్తిమీర గుజ్జు : నాలుగు టీ స్పూన్లు
ఉప్పు : రిచికి సరిపడా

తయారీ విధానం:

* ముందుగా చేపల్ని శుభ్రంగా కడిగి పక్కన బెట్టుకోవాలి.
* మరోవైపు ఒక బౌల్‌ తీసుకుని అందులో వెల్లుల్లి, ఉప్పు, మైదా, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్‌ను కలపాలి. అందులో కొద్దిగా నీళ్ళు పోసి ఈ మిశ్రమాన్ని జారుడుగా కలుపుకోవాలి.
* ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇదివరకే శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న చేపముక్కలకు పట్టించి... కాసేపు వాటిని పక్కన పెట్టుకోవాలి.
* అరగంట తర్వాత నాన్ స్టిక్ పాన్‌ను తీసుకుని, అందులో వెన్న వేసి కరిగించాలి.
* అలా కరిగించిన తర్వాత అందులో చేపముక్కలు ఒక్కొక్కటి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
* చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే బటర్ గార్లిక్ ఫ్రైడ్ ఫిష్ రెడీ!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : butter garlic fish fry  weekend recipes  healthy food recipes  

Other Articles

  • Chicken garelu cooking tips which is special weekend food

    నోరూరించే చికెన్ గారెల తయారీ...

    Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more

  • Chicken lollipops cooking tips best healthy food recipes

    చికెన్ లాలీ పాప్స్ ని ఎలా చేస్తారో తెలుసా..?

    Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more

  • Rice vada cooking method kitchen tips

    బియ్యపు పిండితో వేడివేడి వడలు..

    Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more

  • Chicken garelu recipe cooking tips healthy food items nov veg

    చల్లని వెదర్ లో హాట్ చికెన్ గారెలు..

    Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more

  • Roasted chicken lemon rice cooking tips

    రోస్టెడ్ చికెన్ లెమన్ రైస్ తయారీ విధానం

    Aug 22 | వీకెండ్ లో రెగ్యులర్ గా తినే భోజనం కాకుండా స్పెషల్ గా ఏమైనా తినాలనుకుంటున్నారా..? అయితే రోస్టెడ్ చికెన్ లెమన్ రైస్ తింటే ఎంతో రుచికరంగా వుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో... Read more