బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది. అదేమిటంటే.. ఈ వడల్ని రెగ్యులర్ గా తీసుకుంటే శరీర బరువును నియంత్రించుకోవచ్చు. ఎందుకంటే.. ఈ వడల్లో ఆరోగ్యకరమైన పోషకాలతోపాటు బరువును తగ్గించే క్యాలరీలు వుంటాయి. కాబట్టి.. వీటిని నిత్యం తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. మరి.. వీటిని ఎలా తయారుచేస్తారో తెలుసుకుందామా...
కావలసిన పదార్థాలు :
బియ్యం పిండి : ఒక కప్పు
కొబ్బరి తురుము : ఒక కప్పు
పచ్చిమిర్చి : పావు స్పూన్
ఉల్లి తరుగు : అర కప్పు
కొబ్బరి నూనె : తగినంత
ఉప్పు : తగినంత
తయారీ విధానం :
* ముందుగా కొద్దిపాటి బియ్యం తీసుకుని బాగా వేయించాలి. అనంతరం పౌడర్ గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
* మరోవైపు కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఉల్లి తదితరాలను మిక్సీలో వేసి మెత్తని పేస్టులా అయ్యేవరకు రుబ్బుకోవాలి.
* ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బియ్యం పిండిలో చేర్చి.. గారెలకు వీలుగా పిండిని నీటితో కలిపి సిద్ధం చేసుకోవాలి.
* అందులో కొద్దిగా ఉప్పు చేర్చి.. గారెల్లా నూనెలో వేపి తీసుకోవాలి. దోరగా వేగాక బయటకు తీసేయాలి. అంతే!
(And get your daily news straight to your inbox)
Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more
Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more
Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more
Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more
Aug 22 | వీకెండ్ లో రెగ్యులర్ గా తినే భోజనం కాకుండా స్పెషల్ గా ఏమైనా తినాలనుకుంటున్నారా..? అయితే రోస్టెడ్ చికెన్ లెమన్ రైస్ తింటే ఎంతో రుచికరంగా వుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో... Read more