యావత్ ప్రపంచంలోనే మన భారతదేశంలో వున్న సంస్కృతీ - సంప్రదాయాలు మరే దేశంలో కూడా కనిపించవు. దాదాపు అన్ని దేశాలలో ఏదో ఒక చిహ్నంగానీ, వస్తువుగానీ, వంటకంగానీ ప్రత్యేకంగా దర్శనం ఇస్తుంటాయి. కానీ మన భారతదేశంలో మాత్రం అన్యమతాలవారు నివసిస్తుండటం వల్ల ప్రపంచంలో వున్న ప్రత్యేకతలన్నీ ఇక్కడే కనిపిస్తుంటాయి. అందులో ముఖ్యంగా మన దేశంలో ఎక్కువగా అందుబాటులో వుండేది రకరకాల వంటకాలు. ప్రపంచ నలమూలలలో దాగివున్న ఎన్నోరకాల వంటకాలు మన మనదేశంలో ప్రతిఒక్క చోట లభ్యమవుతాయి. అందులో కొన్ని ముఖ్యమైన వంటకాలు ఇక్కడ ఎంతో ప్రాధాన్యతను కూడా సంతరించుకున్నాయి. అటువంటి వంటకాలలో చైనీస్ ఫ్రైడ్ చికెన్ లెగ్స్ ఒకటి.
చైనీస్ ఫ్రైడ్ చికెన్ లెగ్స్ ఎంతో యమ్మీ, డెలీషియస్ గా వుంటుంది. సాధారణంగా ఇది చికెన్ డ్రమ్ స్టిక్, చికెన్ ఫ్రైలాగే కనిపిస్తుంది. కానీ వాటికి భిన్నంగా ఇధి ఎంతో రుచికరంగా, నోరూరించే విధంగా వుంటుంది. ఇది ఎంతో టేస్టీగా వుండటమే కాకుండా ఎక్కువ శక్తిగల తక్కువ క్యాలరీలను కలిగి వుంటుంది. ఫలితంగా శరీర బరువు కూడా పెరగదు. అదే చికెన్ డ్రమ్ స్టిక్ లో అయితే క్యాలరీలు అధికంగా వుండటం వల్ల శరీర బరువు కూడా పెరుగుతుంది. అయితే ఫ్రైడ్ చికెన్ ఫ్రైను తయారుచేసే సమయంలో కొన్ని జాగ్రత్తలను పాటిస్తే.. తక్కువ క్యాలరీలతో కూడిన ఫ్రైను తయారుచేసుకోవచ్చు. అందుకుగాను దీనిని ఎక్కువసమయం వరకు డీప్ ఫ్రై చేయకుండా, స్టైర్ ఫ్రై స్థితిలో వుండగానే పక్కకు తీసేసుకోవాలి. దీంతో క్యాలరీలు తక్కువ మోతాదులో వుంటాయి. అటువంటి చైనీస్ ఫ్రైడ్ చికెన్ ను తక్కువ సమయంలో తయారుచేసే విధానం మీకోసం...
లెగ్స్ తయారీకి కావలసిన పదార్థాలు :
* చికెన్ లెగ్స్ : 4
* వెనిగర్ : 2 టేబుల్ స్పూన్స్
* వెల్లుల్లి రెబ్బలు : 5-6 (సన్నగా తరుముకోవాలి)
* పచ్చిమిర్చి : 2 (సన్నగా తరగాలి)
* సోయా సాస్ : 1 టేబుల్ స్పూన్
* కార్న్ ఫ్లోర్ : 1 టేబుల్ స్పూన్
* ఉల్లిపాయ : 1 (చిన్నిచిన్న ముక్కలుగా తరుముకోవాలి)
* బెల్ పెప్పర్ : 1 (చిన్న ముక్కలుగా తరుముకోవాలి)
* చైనీస్ గ్రాస్ : రుచికి సరిపడేంత (చిటికెడు)
* నూనె : 2 టేబుల్ స్పూన్స్
* ఉప్పు : రుచికి సరిపడేంత
తయారుచేసే విధానం :
* ముందుగా తీసుకున్న చికెన్ ముక్కలను శుభ్రంగా నీటిలో కడుక్కోవాలి.
* ఒక బౌల్ లో వెనిగర్, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు మొదలగు వాటిని వేసి బాగా మిక్స్ చేసుకొని, కొద్దిసేపటి వరకు పక్కన పెట్టుకోవాలి.
* ఒక మిక్సింగ్ బౌల్ ను తీసుకుని అందులో సోయాసాస్, పచ్చిమిర్చి, చైనీస్ గ్రాస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. (ఈ మొత్తం మిశ్రమాన్ని సోయా మిక్సర్ అంటారు)
* శుభ్రం చేసుకున్న చికెన్ లెగ్స్ ను పైన కలుపుకున్న సోయా మిక్సర్ లో డిప్ చేయాలి. తరువాత వాటిని అందులో నుంచి బయటకు తీసి కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) లో వేసి పొర్లించాలి.
* ఒక ఫ్రైయింగ్ పాన్ ను తీసుకుని, అందులో కొద్దిగా నూనెను పోసి, స్టౌ మీద వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడయిన తరువాత అందులో చికెన్ లెగ్స్ వేయాలి.
* చికెన్ లెగ్ పీసులు బ్రౌన్ కలర్ లో వచ్చేంతవరకు మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి.
* ఇలా రెండు నిముషాలవరకు వేడి చేసిన తరువాత స్టౌ మంటను తగ్గించి, అందులో ఉల్లిపాయ ముక్కలు, బెల్ పెప్పర్ ముక్కలు వేసి వేయించుకోవాలి.
ఈ విధంగా మిశ్రమాలను కలిపి బాగా వేడి చేసిన తరవాత చికెన్ ముక్కలను కిందకు దించేయాలి. ఇలా ఈ విధంగా చైనీస్ ఫ్రైడ్ చికెన్ లెగ్స్ ను ఎంతో సులభంగా తయారుచేసుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more
Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more
Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more
Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more
Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more