సహజంగా అబ్బాయిలు, అమ్మాయిలవైపు చాలా త్వరగా ఆకర్షితులవుతారు. అమ్మాయిల అందచందాలకు వెర్రెక్కిపోయి, ఆమెను పొందటానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. అమ్మాయిలు కూడా కొంతమంది హ్యాండ్ సమ్ అబ్బాయిలవైపు ఆకర్షితులయి, వారిని పొందడానికి తిప్పలు పడుతుంటారు.
అయితే అలా చేయడానికి ముందు.. వారితో ప్రేమగా మెలగాలి. తొందరపాటు పడి తప్పులు చేయకుండా సహనంగా స్నేహపూర్వకంగా వుండాలి. వారికి మీ మీద నమ్మకం కలిగేలా చేయాలి. తనపట్ల మీకున్న అభిమానాన్ని వారికి వ్యక్తిపరిచేలా చేయాలి.
సాధారణంగా ఒక వ్యక్తి.. తనను ఎవరైనా ఎక్కువగా అభిమానిస్తున్నారని తెలిస్తే, వారితో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అలా ఒకరిమధ్య ఇంకొకరికి కలిగిన అభిమానం జీవితాంతం సుఖాంతంగా గడపడానికి ఎంతో తోడ్పడుతుంది.
ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడేలా చేయాలంటే ఈ చిట్కాలను ఒకసారి ఆచరించి చూడండి....
మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడేలా చేయాలంటే.. మొదటగా మీలో వున్న స్వతంత్రత భావాలను వారికి తెలియచేసేలా చేయండి. మీలో వున్న కోరికలను వారికి వ్యక్తపరచండి. మగవారయితే... స్వతంత్రంగా వ్యవహరించే ఆడవాళ్లకు చాలా త్వరగా ఆకర్షితులవుతారు.
మీరు ఇష్టపడే వ్యక్తితో ఎల్లప్పుడు అంటిపెట్టుకుని వుండకుండా వుండాలి. వారు మిమ్మల్ని ఇష్టపడాలంటే... వారి నుండి కొంచెం దూరాన్ని పాటించాలి. వారిలో మీరు దూరం అవుతున్నారనే భావాలు కలుగజేసేలా వుండాలి.
సాధారణంగా ఎటువంటి బంధుత్వాలయిన సమానత్వం అనేది ఖచ్చితంగా వుండాలి. వారు చేసే కార్యకలాపాలలో మీరు కూడా పాల్గొనాలి. వారు కూడా మీ పనులలో సహాయం చేయడానికి వీలుగా చేసుకోవాలి.
ప్రతిఒక్కరి జీవితంలో కష్టాలు అనేవి సహజం. మీరు ఇష్టపడేవారు కష్టకాలాల్లో వున్నప్పుడు వారికి మద్దతిస్తే చాలా సంతోషిస్తారు. వారితో తోడుగా వుండి, సుఖదు:ఖాలను పంచుకోవడం వల్ల వారు మీతో చాలా దగ్గరయ్యే అవకాశాలు వుంటాయి.
అబ్బాయిలు చాలావరకు అమ్మాయిల అందానికి తొందరగా ఆకర్షించబడతారు. మీ అందాన్ని ప్రతిరోజు ప్రదర్శించడం వల్ల వారు మీతోనే కాలం గడపడానికి ఆసక్తి చూపుతారు.
అబ్బాయిలను ఆకర్షించాలంటే అమ్మాయిలో ముఖ్యంగా వుండాల్సింది శ్రద్ధ. వారు మాట్లాడుతున్నప్పుడు మీరు శ్రద్ధగా వింటే.. అతనిమీద మీకున్న అభిమానాన్ని తెలుసుకునే అవకాశం వుంటుంది. అబ్బాయిలు ఇటువంటి విషయాలను చాలా ఎక్కువగా ఇష్టపడతారు.
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది. అబ్బాయిలుకాని, అబ్బాయిలుకాని పరస్ఫరంగా అటువంటి ప్రత్యేకతలను ఎక్కువగా ఇష్టపడతారు. మీరు ఇష్టపడేవారిని మిమ్మల్ని కూడా ఇష్టపడాలంటే.. మీలో వున్న ప్రత్యేకతలను వారితో పంచుకోండి. ఇలా చేయడం వల్ల వారు దగ్గరవుతారు.
అబ్బాయిని పొందాలని అమ్మాయిగాని, అమ్మాయిని పొందాలని అబ్బాయిగాని తమను తాము మొత్తంగా మార్చుకుంటారు. చివరాఖరికి ఇతరులను తమవైపు ఆకర్షించడానికి సినిమాలలో వుండే హీరో, హీరోయిన్లుగా మలుచుకుంటారు. మరీకొందరైతే పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తుంటారు. అయితే ఇటువంటి తప్పులు చేయకుండా మీరు మీరుగానే వుండడానికి ప్రయత్నించండి.
(And get your daily news straight to your inbox)
Apr 25 | ప్రేమ... ప్రస్తుతకాలంలో ఇది కంప్యూటర్ లో వైరస్ పాకిపోయినట్లుగా ప్రపంచం నలుమూలలా వ్యాపించిపోయింది. 7వ తరగతి నుంచి విద్యార్థివిద్యార్థినులు ప్రేమించుకుంటున్నామంటూ తమ పెద్దలనే ఎదురిస్తుంటారు. ప్రేమిస్తున్నవారికి ఎలాగైనా దక్కించుకోవాలని తమ ఇంట్లోవున్నవారిగురించి, వారి ప్రేమను... Read more
Apr 22 | సాధారణంగా అబ్బాయిలు తమ మనసులోని భావాలను ప్రియురాలికి వ్యక్తపరచడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. ప్రియురాలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లడం, ప్రతి రోజూ ఆమెను వెంబడించడం, ప్రేమ లేఖలు రాయడం, తనకు నచ్చిన గిఫ్ట్... Read more
Apr 09 | సాధారణంగా ప్రేమ వ్యవహారాలు స్నేహం నుంచే మొదలవుతాయి. ఎవరైనా ఒకరు నచ్చినప్పుడు వారితో ముందుగా స్నేహం చేసుకుంటారు. ఆ తరువాత తమలో వున్న భావాలను, ఇష్టాయిష్టాలను తెలుసుకుని, అనుకోకుండా ప్రేమలో పడిపోతారు. ఇటువంటి వ్యవహారాలు... Read more
Apr 05 | ప్రస్తుతకాలంలో ప్రేమ అనే విషయం సర్వసాధారణం అయిపోయింది. పిల్లల నుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరు ఎవరినిపడితే వారిని ప్రేమించేసుకుంటున్నారు. ఎవరైనా ఒక అమ్మాయి నచ్చితే చాలు... అప్పటికప్పుడే వెళ్లి ఐ లవ్ యూ చెప్పేస్తారు. అదేవిధంగా... Read more
Apr 02 | సాధారణంగా ఏదైనా ఒక వ్యక్తితో పరిచయం అయినప్పుడు ముందు అది స్నేహంగా మారుతుంది. క్రమక్రమంగా వారితో నిత్యం కలుస్తుండడం, మాట్లాడుతుండడంతో అది ప్రేమగా మారిపోతుంది. అలా వారిమధ్య ప్రేమ చిగురించి, తరువాత పెళ్లి చేసుకుంటారు. ... Read more