అబ్బాయిలు అమ్మాయిలను ప్రపోజ్ చేయడానికి రకరకాల ధోరణులను, పద్ధతులను అనుసరిస్తూ వుంటారు. మరికొందరు ప్రత్యేకంగా విశిష్టమైన చేష్టలు చేస్తూ కొంతమందిని భయపెట్టించేస్తుంటారు. తమవైపు అమ్మాయిలను ఆకర్షితులు చేయడానికి విచిత్రమైన వ్యవహారాలను పాటిస్తుంటారు.
ఉదాహరణకు చెప్పుకోవాలంటే... కొందరు అబ్బాయిలు తమకిష్టమైన అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి వారికి ఇష్టమైన హీరోలా తయారయి వికారంగా ప్రవర్తిస్తారు. అమ్మాయికి ఇష్టం లేకపోయినప్పటికీ బలవంతం చేస్తుంటారు. ఇటువంటి పద్ధతులను అనుసరించేవారిని ‘గీక్’ అని పిలుస్తారు.
ఇటువంటి వ్యవహారాలను పాటిస్తూ.. చాలావరకు అబ్బాయిలు ప్రేమలో విఫలమవుతుంటారు. ప్రేమలో విఫలమవ్వడానికి ఇంకొన్ని కారణాలు కూడా వున్నాయి.. అవేమిటో ఒకసారి చూద్దాం...
అబ్బాయిలు, అమ్మాయిని ప్రపోజ్ చేయడంలో మొదటిగా విఫలమయ్యేది డ్రెస్సింగ్ స్టయిల్ లో. ఎందుకంటే... ఇటువంటి సందర్భాల్లో అబ్బాయిలు తమకిష్టమైన అమ్మాయికి ఆకర్షణీయంగా కనబడేందుకు హీరోలా లేదా కామిక్ హీరోలాగా వికారమైన డ్రెస్సులను వేసుకొస్తారు. దీనిని చూడలేక అమ్మాయిలు చచ్చిపోతుంటే.. పైగా ఆ హీరోల సినిమాలలో వున్న కొన్ని రొమాంటిక్ డైలాగ్స్ చెప్పి ఘోరమైన అవమానాన్ని కొని తెచ్చుకుంటారు.
అమ్మాయిల మనస్తత్వం ఎలా వున్నా... వారు లోలోపల చాలా సున్నితంగానే వుంటారు. అమ్మాయిలను ప్రపోజ్ చేయడానికి నానాతంటాలు పడకుండా... సింపుల్ గా వెళ్లి అడిగేస్తే చాలు. చాలామంది అమ్మాయిలు కూడా సింపుల్ గా వున్న అబ్బాయిలనే ఇష్టపడతారు.
సినిమాలు లేదా కామిక్స్ నుంచి ప్రేరణ పొందే కొందరు ప్రేమికులు... అందులో వున్న పాత్రలలో లీనమైపోయి తమ ప్రేమికురాలిని మెప్పించడానికి ప్రయత్నిస్తుంటారు. అందులో చూపించే రకరకాల సూట్స్, రింగ్స్ వంటివి తీసుకెళ్లి అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చూస్తారు. కాని ఇటువంటివాటిని సాధారణంగా ఏ అమ్మాయి ఇష్టపడదు.
అమ్మాయి వేసే ప్రతి చిన్న జోక్ కు కొంతమంది అమ్మాయిలు ఎగబడి నవ్వేస్తుంటారు. అబ్బాయిలు కూడా అమ్మాయిలను తమ బుట్టలో పడేయడానికి పిచ్చిపిచ్చి జోకులు వేస్తూ, కామిక్స్ సినిమాలలో వుండే హీరోలాగా మొహాలను వికారంగా, కమెడియన్ లాగా యాక్ట్ చేయడం వంటివి మొదలుపెట్టేస్తారు. ఇటువంటివన్ని అమ్మాయిని ఒక మోతాదులో నచ్చుతాయే తప్ప... ప్రతిసారి ఇటువంటి ట్రిక్స్ ను ఉపయోగించడం వల్ల మీరు ప్రేమించిన అమ్మాయి మీకు పిచ్చి పట్టిందనే భావనతో చూసి చూడనట్టుగా వుంటుంది.
కొందరు అబ్బాయిలు కవిత్వాలు చెప్పడంలో మహామేధావులు అయి వుంటారు. మరికొందరికి కవిత్వాల గురించి అసలు కొంచెమైన జ్ఞానం వుండదు. ఇటువంటివారు అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి కవిత్వాలు రాకపోయినా... ఏదో సైన్స్ ఫిక్షన్ కు సంబంధించిన కవిత్వాలను డిక్షనరీలో చూసి, బట్టికొట్టి చెప్పి... నెత్తిమీద బండరాయి వేసుకుంటారు.
ప్రేమించిన అమ్మాయిని ప్రపోజ్ చేసే సమయంలో ఎటువంటి కాంప్లికేటెడ్ విషయాల గురించి అస్సలు చర్చించకూడదు. జరిగిన విషయాలగురించి ఎక్కువ మాట్లాడకుండా, అమ్మాయిని బోర్ కానివ్వకుండా, వున్న సమయాన్ని వృధా చేసుకోకుండా మనసులో వున్నది వున్నట్టుగా చెప్పేస్తే.. వారు ఒప్పుకోవడానికి అవకాశం వుంటుంది. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి.
(And get your daily news straight to your inbox)
Apr 25 | ప్రేమ... ప్రస్తుతకాలంలో ఇది కంప్యూటర్ లో వైరస్ పాకిపోయినట్లుగా ప్రపంచం నలుమూలలా వ్యాపించిపోయింది. 7వ తరగతి నుంచి విద్యార్థివిద్యార్థినులు ప్రేమించుకుంటున్నామంటూ తమ పెద్దలనే ఎదురిస్తుంటారు. ప్రేమిస్తున్నవారికి ఎలాగైనా దక్కించుకోవాలని తమ ఇంట్లోవున్నవారిగురించి, వారి ప్రేమను... Read more
Apr 22 | సాధారణంగా అబ్బాయిలు తమ మనసులోని భావాలను ప్రియురాలికి వ్యక్తపరచడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. ప్రియురాలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లడం, ప్రతి రోజూ ఆమెను వెంబడించడం, ప్రేమ లేఖలు రాయడం, తనకు నచ్చిన గిఫ్ట్... Read more
Apr 09 | సాధారణంగా ప్రేమ వ్యవహారాలు స్నేహం నుంచే మొదలవుతాయి. ఎవరైనా ఒకరు నచ్చినప్పుడు వారితో ముందుగా స్నేహం చేసుకుంటారు. ఆ తరువాత తమలో వున్న భావాలను, ఇష్టాయిష్టాలను తెలుసుకుని, అనుకోకుండా ప్రేమలో పడిపోతారు. ఇటువంటి వ్యవహారాలు... Read more
Apr 05 | ప్రస్తుతకాలంలో ప్రేమ అనే విషయం సర్వసాధారణం అయిపోయింది. పిల్లల నుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరు ఎవరినిపడితే వారిని ప్రేమించేసుకుంటున్నారు. ఎవరైనా ఒక అమ్మాయి నచ్చితే చాలు... అప్పటికప్పుడే వెళ్లి ఐ లవ్ యూ చెప్పేస్తారు. అదేవిధంగా... Read more
Apr 02 | సాధారణంగా ఏదైనా ఒక వ్యక్తితో పరిచయం అయినప్పుడు ముందు అది స్నేహంగా మారుతుంది. క్రమక్రమంగా వారితో నిత్యం కలుస్తుండడం, మాట్లాడుతుండడంతో అది ప్రేమగా మారిపోతుంది. అలా వారిమధ్య ప్రేమ చిగురించి, తరువాత పెళ్లి చేసుకుంటారు. ... Read more