Ban vs SA: Bangladesh Scripts Historic 2-1 ODI Series Win చరిత్రను లిఖించిన బంగ్లాదేశ్: ప్రోటీస్ పై ఘనవిజయం

Bangladesh cricket team scripts historic 2 1 odi series win in south africa

South Africa, Bangladesh, SA vs BAN, South Africa vs Bangladesh 3rd ODI highlights; South Africa vs Bangladesh, South African cricket team; Centurion, Bangladesh cricket team; Shakib Al Hasan, Taskin Ahmed, Tamim Iqbal, Quinton de Kock, Kagiso Rabada, David Miller, IPL 2022, Bangladesh, Temba Bavuma, Centurion, Johannesburg, Taskin Ahmed, Liton Das, Tamim Iqbal, South Africa, cricket news, sports news, sports, cricket

The Bangladesh national cricket won the ODI series 2-1 against South Africa. South Africa won the toss and decided to bat first. The scorecard reading 66/1 even proved his decision right, but what followed was absolute carnage from the Bangaldesh team. Their bowlers and fielders teamed up to pick one after another South African wickets and eventually bundled out the Proteas for a paltry 154.

చరిత్రను లిఖించిన బంగ్లాదేశ్: ప్రోటీస్ పై 2-1తో వన్డే సిరీస్ కైవసం

Posted: 03/24/2022 07:23 PM IST
Bangladesh cricket team scripts historic 2 1 odi series win in south africa

దక్షిణాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. సఫారీలతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకుని దక్షిణాఫ్రికాలో తొలిసారి సిరీస్‌ను సొంతం చేసుకున్న ఘనత సాధించింది. సిరీస్ విజయాన్ని నిర్ణయించే చివరిదైన మూడో మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్ల తేడాతో విజయం సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తెంబా బవుమా సేన.. బంగ్లా బౌలర్ తస్కిన్ అహ్మద్ ధాటికి కుప్పకూలింది.

తస్కిన్ అహ్మద్ ప్రోటీస్ జట్టును బంతితో దెబ్బతీశాడు. బ్యాటింగ్ కు వచ్చిన బ్యాట్స్ మెన్లను ఎవరినీ క్రీజులో నిలువనీయకుండా వెంటవెంటనే వెనక్కు పంపాడు. తస్కీన్ దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. తస్కిన్ 35 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా 37 ఓవర్లలో 154 పరుగులకే దక్షిణాఫ్రికా చాపచుట్టేసింది. ప్రొటీస్ బ్యాటర్లలో జానెమన్ మలాన్ చేసిన 39 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. కేశవ్ మహారాజ్ 28, డ్వైన్ ప్రెటోరియస్ 20 పరుగులు చేశారు. షకీబల్ హసన్ 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఓపెనర్లు లిటన్ దాస్ (48), కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (87) అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 20.5 ఓవర్లలో 127 పరుగులు జోడించారు. అనంతరం లిటన్ దాస్ అవుట్ కాగా, క్రీజులోకి వచ్చిన షకీబల్ హసన్ 18 పరుగులు చేసి మిగతా పని పూర్తి చేశాడు. ఫలితంగా 9 వికెట్ల భారీ తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తస్కిన్ అహ్మద్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. బంగ్లాదేశ్ చారిత్రక విజయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangladesh  Temba Bavuma  Centurion  Johannesburg  Taskin Ahmed  Liton Das  Tamim Iqbal  South Africa  sports  cricket  

Other Articles