Rohit Sharma on India-England Test series final result ఇంగ్లాండ్ తో చివరి టెస్టుపై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు

Rohit sharma makes big statement on india england test series says this about final result

Rohit Sharma, Hit Man, Rohit sharma on final test, Rohit Sharma on England test, BCCI, England and walves cricket Board, India vs England, Rohit Sharma, Team India, Cricket news, sports news, Cricket, Sports

Rohit Sharma, who was the highest run-getter for India in the four Tests, believes that India are the real winners of the Test series although officially final result has to be decided by the England Cricket Board, the Board of Control for Cricket in India (BCCI) and the ICC.

ఇంగ్లాండ్ తో చివరి టెస్టుపై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు

Posted: 10/04/2021 07:37 PM IST
Rohit sharma makes big statement on india england test series says this about final result

ఇంగ్లండ్‌తో జ‌ర‌గాల్సిన ఐదో టెస్ట్ అర్ధంత‌రంగా ర‌ద్ద‌యిన సంగ‌తి తెలుసు క‌దా. క‌రోనా భ‌యంతో టీమిండియా ప్లేయ‌ర్స్ చివ‌రి టెస్ట్ ఆడ‌టానికి నిరాక‌రించారని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చెప్పింది. నాలుగు టెస్ట్‌లు ముగిసే స‌మ‌యానికి టీమిండియా 2-1 లీడ్‌లో ఉంది. ఇప్పుడు ఆ చివ‌రి టెస్ట్ జ‌రుగుతుందా లేదా.. జ‌రిగితే ఏకైక టెస్ట్‌లా జ‌రుగుతుందా లేక ఈ సిరీస్‌లో భాగంగానా అన్న‌దానిపై ఎలాంటి స్ప‌ష్ట‌త లేదు. అయితే దీనిపై తాజాగా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ స్పందించాడు. ఈ సిరీస్‌లో నిజ‌మైన విజేత ఇండియానే అని రోహిత్ స్ప‌ష్టం చేశాడు. అయితే తుది ఫలితం మాత్రం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ, ఐసీసీ తేలుస్తాయ‌ని చెప్పాడు.

ఈ సిరీస్‌లో ఇండియా త‌ర‌ఫున అత్య‌ధిక స్కోర‌ర్ రోహిత్ శ‌ర్మ‌నే. నా దృష్టిలో ఈ సిరీస్ మేము గెలిచాము. చివ‌రి టెస్ట్ సంగ‌తేంటో నాకు తెలియ‌దు. దానిని ఏకైక టెస్ట్‌లాగా ఆడ‌తామా.. దాంతోనే సిరీస్ నిర్ణ‌యిస్తారా తెలియ‌దు. దానిప ఎలాంటి స్ప‌ష్ట‌త లేదు అని రోహిత్ అన్నాడు. సోమ‌వారం అడిడాస్ ఏర్పాటు చేసిన ఓ వ‌ర్చువ‌ల్ ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో రోహిత్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. సిరీస్‌లో రోహిత్ 52 స‌గ‌టుతో 368 ర‌న్స్ చేశాడు. అంతేకాదు ఇదే సిరీస్‌లో ఇండియా బ‌య‌ట టెస్టుల్లో త‌న తొలి సెంచ‌రీ కూడా చేయ‌డం విశేషం. ఇంగ్లండ్ టూర్ త‌న‌కు బాగుంద‌ని, అయితే ఇదే ఉత్త‌మ‌మ‌ని మాత్రం తాను చెప్ప‌లేన‌ని అన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో త‌న బెస్ట్ రానుంద‌ని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles