ఇంగ్లండ్‌తో జరిగిన మహిళల తొలి టీ20 మ్యాచ్‌లో ఇండియా 18 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. కానీ ఆ మ్యాచ్‌లో హర్లీన్ డియోల్ అందుకున్న క్యాచ్ క్రికెట్ ప్రేమికుల్ని తెగ అట్రాక్ట్ చేసింది. లాంగ్ ఆఫ్ బౌండరీ వద్ద హర్లీన్ క్యాచ్ అందుకున్న తీరు ఆ మ్యాచ్‌కే హైలెట్. నిజానికి ఇండియన్ ప్లేయర్ హర్లీన్ ఆ క్యాచ్ పట్టుకునేందుకు ఎంతో సమయస్పూర్తిని ప్రదర్శించింది. లాంగ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హర్లీన్.. ఇంగ్లండ్ బ్యాట్స్‌వుమెన్ అమీ ఎల్లన్ జోన్స్ కొట్టిన షాట్‌ను గాలిలోకి ఎగిరి అందుకున్నది.
కానీ బ్యాలెన్స్ తప్పి బౌండరీ లైన్ దాటుతున్నట్లు గమనించిన హర్లీన్ తన చేతిలో ఉన్న బంతిని మైదానంలోకి విసిరింది. మళ్లీ బౌండరీ రోప్ దాటి వచ్చి.. డైవ్ చేస్తూ ఆ బంతిని అందుకుని అందర్నీ స్టన్ చేసింది. ఈ అద్భుత క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. ఆ వీడియోపై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఓ కామెంట్ పోస్టు చేశారు. క్రికెట్ ఫీల్డ్‌లో ఇలాంటి క్యాచ్‌లు అరుదు అని, ఇదో టాప్ క్లాస్ క్యాచ్ అని లక్ష్మణ్ ప్రశంసించాడు.
తొలుత ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 177 రన్స్ చేసింది. ఇక చేజింగ్‌కు దిగిన ఇండియా 8.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన 54 రన్స్ చేసిన సమయంలో వర్షం ఆటను అడ్డుకున్నది. డీఎల్ఎస్ పద్ధతిలో ఇంగ్లండ్ 18 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఆదివారం రోజున రెండవ టీ20 మ్యాచ్ హోవ్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో జరగనున్నది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more