పర్యాటక జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమిని చవిచూసిన టీమిండియా జట్టు చెన్నైలో జరిగిన రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకుంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పర్యాటక జట్టును కేవలం 56 ఓవర్లలోనే టీమిండియా బౌలర్లు చాపచుట్టించేశారు. భారత బౌలర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ నుంచే టీమిండియా ఇంగ్లాండ్ పై పేచేయి సాధించాలన్న పట్టుదలతో వుంది. ఫలితంగా చెన్నైలో రెండు ఇన్నింగ్స్ లో నిలదొక్కుకోలేక అత్యంత తొందరగా చాపచుట్టేసింది.
తొలిఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీసిన అక్షర్ పటేల్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అలాగే, తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టాడు. వారికి తోడు రెండో ఇన్నింగ్స్‌లో కుల్‌దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితం... టీమిండియా 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 329, రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 134, రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో బర్న్స్ 25, సిబ్లీ 3, లారెన్స్ 26, జాక్ లీచ్ 0, కెప్టెన్ రూట్ 33, బెన్ స్టోక్స్ 8, పోప్ 12, బెన్ ఫోక్స్ 2 , మోయీన్ అలీ 43, స్టోన్ 0, బ్రాడ్ 5 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టి టీమిండియా గౌరవ ప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ, రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో అదరగొట్టిన అశ్విన్‌పై సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తోంది.
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మినహా ఎవ్వరూ రాణించలేదని బావిస్తున్న తరుణంలో తన హోం గ్రౌండ్ లో విశ్వరూపాన్ని ప్రదర్శించాడు అశ్విన్. ఓ వైపు బంతితోనూ రాణిచిన అశ్విన్.. ఈ టెస్టులో బ్యాటుతోనూ రాణించాడు. మరోలా చెప్పాలంటే చెన్నై రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా తరపున శతకం బాదిన హీరోగా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 26, శుభ్‌మన్ గిల్ 14, పుజారా 7, కోహ్లీ 62, పంత్ 8, రహానె 10, అక్షర్ పటేల్ 7, అశ్విన్ 106 కుల్‌దీప్ యాదవ్ 3, ఇషాంత్ శర్మ 7, సిరాజ్ 16 పరుగులు చేశారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా రవిచంద్రన్ అశ్విన్ ఎంపికయ్యాడు.
(And get your daily news straight to your inbox)
Feb 27 | దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్‌కు కెప్టెన్ మిథాలీ రాజ్, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సభ్యుల... Read more
Feb 27 | ఇంగ్లండ్‌తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్‌బౌలర్ అహ్మదాబాద్ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత... Read more
Feb 16 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేయగా, అందులో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 25 మ్యాచులు అడిన ఇంగ్లాండ్ 6877 పాయింట్లతో 275 రేటింగ్ తో అగ్రస్థానంలో కోనసాగుతోంది. కాగా... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. పర్యాటక జట్టుపై ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్... Read more
Feb 09 | టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన తాజా ట్వీట్ ద్వారా తన అభిమానులతో పాటు టీమిండియా క్రికెట్ అభిమానులను కూడా అందోళనకు గురిచేస్తున్నాడు. ట్విటర్ వేదికగా రిలీజ్ చేసిన వీడియో.. టీమిండియా మాజీ... Read more