Mushfiqur Rahim tried to hit teammate twice in the same match బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముప్పికర్ క్రీడాస్ఫూర్తికి దర్పణం

Mushfiqur rahim apologises after angry confrontation with teammate

Mushfiqur Rahim, Nasum Ahmed, Mushfiqur Rahim news,Mushfiqur Rahim fight, Mushfiqur Rahim punchs teammate, Mushfiqur Rahim hits teammate, Mushfiqur Rahim age, Mushfiqur Rahim Banglabandhu T20 League latest news, sports news, latest sports news, cricket news, sports, cricket

Former Bangladesh skipper Mushfiqur Rahim had to face a lot of heat on social media following his on-field gesture towards teammate Nasum Ahmed in a recent Bangabandhu T20 Cup encounter between Beximco Dhaka and Fortune Barishal. During the 17th over of the second innings, Mushfiqur and Nasum, in an attempt to grab a catch, almost collided with each other on the field.

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముప్పికర్ క్రీడాస్ఫూర్తికి దర్పణం

Posted: 12/16/2020 11:41 PM IST
Mushfiqur rahim apologises after angry confrontation with teammate

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఓ వివాదంపై స్పందించాడు. ఓ టీ20 మ్యాచ్ లో సహచర ఆటగాడి పట్ల తాను ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. మ్యాచ్ జరుగుతుండగా, ఓ క్యాచ్ పట్టడానికి వికెట్ కీపింగ్ చేస్తున్న ముష్ఫికర్ రహీమ్ ప్రయత్నించాడు. అదే క్యాచ్ అందుకోవడానికి ఫీల్డర్ నసూమ్ అహ్మద్ కూడా వచ్చాడు. దాంతో ఇద్దరూ ఢీ కొట్టుకునేంత ప్రమాదం ఏర్పడింది. దాంతో నసూమ్ పై కోపోద్రిక్తుడయ్యాడు. 'కొడతా నిన్ను..' అనే స్థాయిలో హావభావాలు ప్రదర్శించాడు. అయితే నసూమ్ మాత్రం ఎంతో సంయమనం పాటించి గొడవ పెద్దది కాకుండా చూశాడు.

ఈ ఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ముష్ఫికర్ పై నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో తన చర్యకు ముష్ఫికర్ పశ్చాత్తాపం ప్రకటించాడు. "నా ఫ్యాన్స్ కు, ప్రేక్షకులకు అందరికీ క్షమాపణలు తెలుపుకుంటున్నా. ఇప్పటికే నా జట్టు సహచరుడు నసూమ్ కు సారీ చెప్పాను. నేను కూడా మానవమాత్రుడ్నే. నేను చేసిన పని ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. అయితే మరోసారి ఇలాంటి తప్పు జరగదని స్పష్టం చేస్తున్నా" అని వివరణ ఇచ్చాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ముష్ఫికర్ రహీమ్ మ్యాచ్ ఫీజు నుంచి పావుభాగం జరిమానాగా విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mushfiqur Rahim  Mushfiqur Rahim fight  Nasum Ahmed  Banglabandhu T20 League  sports  cricket  

Other Articles