When Virat Kohli cried tears of rejection ఎప్పటికీ గుర్తిండిపోయే రోధన రాత్రి.. తొలి పరాజయం: విరాట్ కోహ్లీ

I cried the whole night virat kohli on his most helpless moment

Virat Kohli anushka shrama, virat kohli anushka sharma online classes, virat kohli anushka sharma unacademy.com, virat kohli cried all the night, virat kohli rejected in state level selection, state level selection, unacademy.com, online classes, cricket score, cricket news, Cricket, sports

Amid all the success that Virat Kohli swims in these days, the India captain hasn’t forgotten one of his very first failures in life as a cricketer. Asked about ways to deal with failures, Kohli said: “If I have to talk of one incident from my life, it would be about the first time I was rejected in the state selections. It was late at night, I remember I just cried till three in the morning. Because I scored well, everything was going perfectly for me at that time and then I was rejected.

ఎప్పటికీ గుర్తsÁడిపోయే రోధన రాత్రి.. తొలి పరాజయం: విరాట్ కోహ్లీ

Posted: 04/22/2020 08:39 PM IST
I cried the whole night virat kohli on his most helpless moment

కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఏర్పడిన సంక్షోభంతో మనుషుల్లో కాసింత మార్పు వచ్చిందని.. కరోనా సృష్టిస్తున్న దారుణ మరణాలతో మృతుల కుటుంబాలలో నెలకొన్న బాధలు, వారు పడుతున్న కష్టాలపై సమాజాం జాలీ, దయ, కరుణ కురిపిస్తున్నాయని టీమీండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. ‘అన్‌అకాడమీ’ నిర్వహించిన ఆన్‌లైన్‌ తరగతిలో కోహ్లీ, అతడి సతీమణి అనుష్క శర్మ మాట్లాడారు. ‘‘కరోనా సంక్షోభంతో సమాజంలో ఏ మూలనో దాక్కుని వున్న జాలి, దయ, కరుణ, స్పందించే హృదయాలు మళ్లీ తమ తమ స్థానాలను అక్రమించుకున్నాయని అన్నారు. మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో ముందుండి పోరాడుతున్న పోలీసులు, డాక్టర్లు, నర్సులకు కృతజ్ఞత భావాన్ని చూపిస్తున్నాం. సంక్షోభం నుంచి బయటపడిన తర్వాత కూడా దీన్ని ఇలానే కొనసాగిస్తామని ఆశిస్తున్నా’’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

‘‘కరోనాతో మనం ఓ పాఠాన్ని నేర్చుకుంటున్నాం. కారణం లేకుండా ఏదీ జరగదు. ప్రస్తుతం పారిశుద్ధ కార్మికులు లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఇతరుల కంటే మనం ప్రత్యేకం కాదని తెలుసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. మనమంతా సమాజమనే భావనతో ఏకమవుతున్నాం’’ అని అనుష్క శర్మ తెలిపారు. జీవితంలో నిస్సహాయంగా భావించిన క్షణం గురించి కోహ్లీని సెషనలో అడగ్గా.. ‘‘రాష్ట్ర జట్టుకు ఎంపికకాని సమయంలో నాకు ఏది అనుకూలంగా జరగట్లేదని భావించా. ఆ రోజు రాత్రంతా ఏడ్చాను. ఎందుకు ఎంపిక కాలేదని మా కోచ్‌ను ప్రశ్నించాను’’ అని కోహ్లీ వెల్లడించాడు. ప్రజల్లో కరోనాపై అవగాహన పెంచేందుకు విరుష్క సామాజిక మాధ్యమాల్లో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  anushka shrama  state level selection  unacademy.com  online classes  Cricket  sports  

Other Articles