MS Dhoni should have been banned for 2 matches ధోని అంశాన్ని తేలిగ్గా తీసుకున్న మ్యాచ్ రెఫరీ: వీరూ

Ms dhoni should have been banned for two three games virender sehwag

Virender Sehwag, MS Dhoni, Cricket,RR vs CSK,Rajasthan Royals,ms dhoni,Mahendra Singh Dhoni,ipl 2019,indian premier league,Chennai Super Kings, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Virender Sehwag said MS Dhoni got away lightly after he lashed out at the umpires over a no-ball controversy during Chennai Super Kings' thrilling last-ball win over Rajasthan Royals in Jaipur.

ధోని అంశాన్ని తేలిగ్గా తీసుకున్న మ్యాచ్ రెఫరీ: వీరూ

Posted: 04/13/2019 09:12 PM IST
Ms dhoni should have been banned for two three games virender sehwag

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా పిచ్ వద్దకు దూసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంపైర్ నోబాల్ ఇచ్చి, ఆపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం గమనించిన ధోనీ బౌండరీ లైన్ ఆవల నుంచి ఎంతో ఆవేశంతో పిచ్ వద్దకు వచ్చి అంపైర్లతో వాగ్వివాదం పెట్టుకోవడం తెలిసిందే. కెప్టెన్ కూల్ గా పేరుగాంచిన ధోనీ ఇలా చిన్న విషయానికి క్రీడాస్ఫూర్తిని మర్చిపోయి వ్యవహరించాడంటూ మాజీ క్రికెటర్లు సైతం మండిపడుతున్నారు

అయితే ఒకనాటి ఆయన తోటి క్రికెటర్లు కూడా ఆయన చర్యలపై పెదవి విరుస్తున్నారు. తాజాగా, ధోనీ ఒకప్పటి సహచరుడు వీరేంద్ర సెహ్వాగ్ దీనిపై విమర్శనాత్మక శైలిలో వ్యాఖ్యానించారు. అసలు ధోనికి జరిమానాగా ఆయన ఫీజులో కోత విధించి వదిలేయడంపై సెహ్వాగ్ కు మింగుడుపడటం లేదని అనిపిస్తోంది. ధోని చర్యలపై మ్యాచ్ రిఫరీ చాలా తేలిగ్గా తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించడం ఇందుకు కారణం.

ధోనీ టీమిండియా కోసం ఏనాడూ ఇంత ఆవేశం చూపించలేదని, భారత జట్టు కోసం కోప్పడి ఉంటే తాను ఎంతో సంతోషించేవాడ్నని తెలిపారు. చివరికి ఓ ఐపీఎల్ జట్టు కోసం కోపం ప్రదర్శించాడని పేర్కొన్నారు. పిచ్ మీద ఇద్దరు బ్యాట్స్ మన్లు ఉన్నప్పుడు అంపైర్ నిర్ణయాన్ని వాళ్లు చూసుకోగలరని, డగౌట్ లో కూర్చుని ఉన్న ధోనీ మైదానంలోకి వచ్చిమరీ అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించాల్సిన అవసరంలేదని వీరూ స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను జరిమానాలతో సరిపెట్టకుండా కనీసం రెండుమూడు మ్యాచ్ లైనా నిషేధం విధించాలని సూచించారు. మరి ఇదే అంతర్జాతీయ వేదికలపై బాల్ ట్యాపరింగ్ కు పాల్పడిన అసీస్ క్రికెటర్లను మాత్రం ఆయన ఎందుకనో ఏమీ అనకుండానే వదిలేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virender Sehwag  MS Dhoni  RR vs CSK  Rajasthan Royals  ipl 2019  Chennai Super Kings  ben stokes  cricket  sports  

Other Articles