వన్డేలలో కివీస్ పై 4-1తో సగర్వంగా సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో మాత్రం పేలవంగా ప్రారంభించింది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచులో బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ నిరాశపరిచిన రోహిత్ సేన ఆతిధ్య జట్టు చేతిలో పరాజయం పాలైంది. దీంతో కివీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య జట్టుకు ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (43 బంతుల్లో 84), కొలిన్ మన్రో (20 బంతుల్లో 34) శుభారంభం చేశారు.
మిగిలిన బ్యాట్స్ మెన్ రాణించడంతో పటిష్ఠ టీమిండియా ముందు 220 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్ (22 బంతుల్లో 34) కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు. వెంటవెంటనే మూడు వికెట్లు చేజార్చుకున్నా చివర్లో రాస్ టేలర్ (14 బంతుల్లో 23), కుగులీన్ (7 బంతుల్లో 20) మెరుపులు మెరిపించారు. హార్దిక్ పాండ్య 2, భువి, ఖలీల్, కృనాల్, చాహల్ తలో వికెట్ తీశారు.
ఛేదనకు దిగిన భారత ఆటగాళ్లు అత్యంత ఉదారంగా ప్రవర్తించారు. ఆరుగురు బ్యాట్స్‌మెన్ 5 పరుగుల్లోపే పెవిలియన్ చేరారు. ఎంఎస్ ధోనీ (31 బంతుల్లో 39) టాప్ స్కోరర్ గా నిలిచాడు. విజయ్ శంకర్ (27), శిఖర్ ధావన్ (29) కాస్త కష్టపడ్డారు. కృనాల్ పాండ్య (20) కాసేపు ధోనీకి సహకారం అందించాడు. న్యూజిలాండ్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు వేశారు. పరుగులు చేయాలన్న ఆత్రుతలో పంత్, శంకర్, దినేశ్ కార్తీక్, పాండ్య అనవసర షాట్లు ఆడారు. వికెట్లు పడుతుండటంతో చేయాల్సిన రన్‌రేట్ 22కు చేరింది. కివీస్ బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో రోహిత్ సేన 80 పరుగుల తేడాతో టీ20ల్లో పరుగుల పరంగా అత్యంత ఘోర ఓటమి చవిచూసింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more