Visitors Keen To Seal Off An Unbeatable Lead ముచ్చటగా మూడోసారి: భువికి ఫించ్ హ్యాట్రిక్ వికెట్

French players crash press conference to celebrate world cup triumph

Cricket, News, Australia Cricket Team, Bhuvneshwar Kumar, Aaron Finch, Indian Cricket Team, Australia vs India 2018-19, sports news,sports, latest sports news, cricket news, cricket

Bhuvneshwar Kumar dismissed Australian skipper, Aaron Finch for the third successive time in the three-match ODI series at the MCG.

ముచ్చటగా మూడోసారి: భువికి ఫించ్ హ్యాట్రిక్ వికెట్

Posted: 01/18/2019 04:35 PM IST
French players crash press conference to celebrate world cup triumph

ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ అరోన్ ఫించ్‌పై ఆఖరి వన్డేలోనూ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆధిపత్యం కొనసాగింది. తాజా పర్యటనలో ఆ గడ్డపై ఇప్పటి వరకూ మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడిన భారత్.. అరోన్ ఫించ్‌ని మాత్రం కనీసం ఒక్క అర్ధశతకం కూడా చేయనివ్వలేదు. ఈరోజు మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలోనూ అతడ్ని 14 పరుగులకే పేసర్ భువనేశ్వర్ కుమార్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

దీంతో.. వరుసగా మూడు వన్డేల్లోనూ అరోన్ ఫించ్‌ని ఆరంభంలోనే ఔట్ చేసిన భువీ అతనిపై ‘హ్యాట్రిక్’ ఆధిపత్యం చెలాయించినట్లైంది..! తాజా సిరీస్ లో చివరిగా ఆడిన 12 ఇన్నింగ్స్ ల్లో అతని అత్యధిక స్కోరు 47 కాగా.. ఏకంగా ఎనిమిదిసార్లు 7 పరుగులలోపే పెవిలియన్ చేరడం ఫించ్‌పై భారత్ బౌలర్ల ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తోంది.

సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో 11 బంతులు ఎదుర్కొన్న అరోన్ ఫించ్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత అడిలైడ్ లో జరిగిన రెండో వన్డేలోనూ 19 బంతులు ఎదుర్కొని మళ్లీ 6 పరుగుల వద్దే భువీ బౌలింగ్ లో బంతిని వికెట్లపైకి ఆడుకుని ఔటయ్యాడు. ఇక ఇవాళ జరిగిన మెల్ బోర్న్ వన్డేలోనూ 14 పరుగుల వద్ద భువీకి వికెట్ సమర్పించుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia Cricket Team  Bhuvneshwar Kumar  Aaron Finch  Indian Cricket Team  Cricket  

Other Articles