Dwayne Bravo retires from international cricket అంతర్జాతీయ క్రికెట్ కు డ్వాన్ బ్రావో గుడ్ బై.!

Dwayne bravo announces retirement from international cricket

Dwayne Bravo, West Indies, Trinidad Tobago, Dwayne Bravo retires, Bravo windies, windies cricket board, Cricket, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

West Indies allrounder and former captain Dwayne Bravo has announced his retirement from international cricket, while remaining available to play domestic T20 leagues around the globe.

అంతర్జాతీయ క్రికెట్ కు డ్వాన్ బ్రావో గుడ్ బై.!

Posted: 10/25/2018 07:57 PM IST
Dwayne bravo announces retirement from international cricket

వెస్టిండీస్ క్రికెటర్, ఆల్‌రౌండర్ డ్వాన్ బ్రావో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. తన రిటైర్‌మెంట్ నోట్‌లో బ్రావో పలు విషయాలను ప్రస్తావించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు బ్రావో నోట్‌లో పేర్కొన్నాడు. 2004 ఏప్రిల్‌లో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో మెరూన్ క్యాప్ అందుకున్న క్షణాన్ని తానిప్పటికీ మర్చిపోలేనని బ్రావో గుర్తుచేసుకున్నాడు.


2004లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేతో బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేశాడు. మూడు నెలల తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో తన టెస్ట్ మ్యాచ్ కెరీర్‌ను మొదలుపెట్టాడు. మొత్తం 270 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన డ్వాన్ బ్రావో విండీస్ జట్టులో అంచెలంచెలుగా ఎదిగాడు. బ్రావో ఆడిన 270 మ్యాచ్‌ల్లో 40 టెస్ట్ మ్యాచ్‌లు, 164 వన్డే మ్యాచ్‌లు, 66 టీ20 మ్యాచ్‌లు ఉండటం విశేషం.

2016 సెప్టెంబర్‌లో విండీస్ తరపున బ్రావో చివరిసారిగా ఆడాడు. అప్పటి నుంచే బ్రావో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రచారం జరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత.. బ్రావో తాజా ప్రకటనతో ఈ ప్రచారమే నిజమైంది. ఇండియాలో జరిగే ఐపీఎల్‌లో బ్రావో చెన్నై జట్టు తరపున ఆడాడు. ఆల్‌రౌండర్‌గా తన ఆటతీరుతో ఆకట్టుకున్న బ్రావో 164 వన్డే మ్యాచ్‌ల్లో 2,968 పరుగులు చేసి, 199 వికెట్లు తీశాడు.
 
డ్వాన్ బ్రావో క్రికెట్ కెరీర్
 
బ్యాటింగ్ కెరీర్:
టెస్ట్ మ్యాచ్‌లు-40, పరుగులు-2200, సెంచరీలు-3
వన్డే మ్యాచ్‌లు-164, పరుగులు-2968, సెంచరీలు-2
టీ20 మ్యాచ్‌లు- 66, పరుగులు-1142, హాఫ్ సెంచరీలు-4
ఐపీఎల్ మ్యాచ్‌లు- 122, పరుగులు-1403, హాఫ్ సెంచరీలు-5
 
బౌలింగ్ కెరీర్:
టెస్ట్ మ్యాచ్‌ వికెట్లు- 86
వన్డే మ్యాచ్ వికెట్లు- 199
టీ20 బౌలింగ్- 52వికెట్లు
ఐపీఎల్ కెరీర్- 136 వికెట్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dwayne Bravo  West Indies  retirement  International cricket  windies cricket board  sports  cricket  

Other Articles