India dominate proteas to nine-wicket win రెండో టీ20లోనూ టీమిండియా ఘనవిజయం

Mithali mandhana fire india to nine wicket win over south africa

India vs South Africa, Smriti Mandhana, Mithali Raj, Harmanpreet Kaur, Dane Van Niekerk, Indian womens cricket team. latest cricket news, sports news, sports, cricket

Veteran Mithali Raj and opener Smriti Mandhana hit stylish half-centuries as India cruised to a comfortable nine-wicket victory over South Africa in the second women's T20

ప్రత్యర్థులపై 9 వికెట్ల తేడాతో మన అమ్మాయిల విజయం

Posted: 02/16/2018 07:09 PM IST
Mithali mandhana fire india to nine wicket win over south africa

సఫారీ గడ్డపై పర్యటిస్తున్న టీమిండియా మహిళల జట్టు అతిధ్య జట్టును చిత్తుచేసి ఐదు టీ20 మ్యాచ్ లలో సీరిస్ కైవసం దిశగా అడుగులు వేస్తుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్దేశించిన 143 పరుగుల విజయలక్ష్యాన్ని మిథాలీ సేన సునాయాసంగానే సాధించింది. దీంతో ఐదు టీ20 మ్యాచ్లలో రెండు మ్యాచులలో విజయాన్ని సాధించి మిగిలిన మూడు మ్యాచ్ లలో విజయాలను అందుకునే దానిపై దృష్టిసారించింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్‌ జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

143 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత మహిళల జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. మిథాలీ రాజ్‌ కూడా తనదైన శైలిలో అజేయ ఇన్నింగ్స్ అడింది. కేవలం 61 బంతుల్లో 76 పరుగులు చేసి అజేయంగా నిలింది. దీంతో టీమిండియా జట్టు విజయపథంలో నడిచింది. మరో ఓపెనర్‌ స్మృతి మంథాన 42 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేసింది.  ధాటిగా ఆడే ప్రయత్నంలో దక్షిణాఫ్రికా బౌలర్‌ డేనిల్స్‌ చేతిలో ఎల్బీగా వెనుదిరిగింది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ 7(12బంతుల్లో), మిథాలీ రాజ్‌తో కలిసి లాంఛనం పూర్తిచేసింది.

అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్లు లీ 15(12బంతుల్లో; 3×4), కెప్టెన్‌ డేన్‌ వాన్‌ 15(18బంతుల్లో; 2×4) మంచి శుభారంభమే ఇచ్చారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సునే లస్‌ 33(32బంతుల్లో; 2×4), మరో క్రికెటర్‌ డి కెర్క్ 26(28బంతుల్లో;1×4)కలిసి నిలకడగా ఆడటంతో దక్షిణాఫ్రికా జట్టు భారత్ ముందు 143లక్ష్యాన్ని్ నిర్దేశించగలిగింది. భారత బౌలర్లలో పూనమ్‌ యాదవ్‌, అనూ పాటిల్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs South Africa  Smriti Mandhana  Mithali Raj  Harmanpreet Kaur  Dane Van Niekerk  

Other Articles