Pandya not worthy to be compared with me తప్పులు రిపీట్ అయితే పాండ్యాను నాతో పోల్చకండి

Pandya keeps making mistakes not worthy to be compared with me kapil dev

hardik pandya, kapil dev, india vs south africa, indvsa, savind, sports news, cricket news, cricket, sports

Virat Kohli and men lost the second Test and with that the series. However, the man who was most criticised is Indian all-rounder Hardik Pandya who played a terrible shot to throw away his wicket in the second innings in Centurion.

తప్పులు రిపీట్ అయితే పాండ్యాను నాతో పోల్చకండి

Posted: 01/18/2018 06:28 PM IST
Pandya keeps making mistakes not worthy to be compared with me kapil dev

భారత క్రికెట్‌ దిగ్గజ అల్ రౌండర్ కపిల్ దేవ్ తో హార్దిక్‌ పాండ్యను పోల్చిన వారే ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ లో జరిగిన టెస్టులో 93 పరుగులతో రాణించిన పాండ్య అందరి దృష్టిని ఆకర్షించగా, సెంచూరియన్ లో జరిగిన రెండో టెస్టులో ఆయన ఔట్ అయిన తీరు విమర్శలకు కారణమైంది. తొలి టెస్టులో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన పాండ్యాను ప్రశంసించిన నోళ్లే రెండో టెస్టులో విమర్శలు గుప్పించాయి.

దీంతో రంగంలోకి దిగిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ విభిన్నంగా స్పందించాడు. ‘ఒకవేళ భవిష్యత్తులోనూ పాండ్య ఇలాంటి తప్పులు చేస్తే దయచేసి అతన్ని నాతో పోల్చవద్దు. అతనిలో చాలా ప్రతిభ ఉంది. కేప్‌టౌన్‌ టెస్టులో అది చూపించాడు. కానీ, సెంచూరియన్‌ టెస్టులో కీలకమైన సమయంలో పాండ్య పరుగు కోసం యత్నించి ఘోరంగా ఔటయ్యాడు. ఎంతో బాధ్యతగా ఆడాల్సిన మ్యాచ్‌లో ఇలా చేయడం ఎందుకు’ అని కపిల్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కపిల్‌ దేవ్‌ వ్యాఖ్యలను మరో మాజీ క్రికెటర్‌ సందీప్‌ పాటిల్‌ సమర్థించాడు. ‘నేను కపిల్‌తో కలిసి క్రికెట్‌ ఆడాను. హార్దిక్‌ పాండ్యను ఇప్పుడే కపిల్‌దేవ్‌తో పోల్చడం సరికాదు. 15ఏళ్ల పాటు కపిల్‌ దేశానికి సేవలు అందించాడు. మరపురాని విజయాలు అందించాడు. పాండ్య ఇప్పటి వరకు ఆడింది ఐదు టెస్టు మ్యాచ్‌లే. అప్పుడే కపిల్‌తో పోల్చడం సరికాదు’ అని పాటిల్‌ అన్నారు.  పాండ్య ఔటైన వెంటనే కామెంటరీ బాక్స్‌లో ఉన్న సునీల్‌ గవాస్కర్‌ ‘ఇది క్షమించరాని తప్పు’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hardik pandya  kapil dev  india vs south africa  indvsa  savind  sports news  cricket  

Other Articles