Rohit Sharma hits fastest T20I century రోహిత్ శర్మ మరో రికార్డు.. అదుర్స్..

Rohit sharma slams joint fastest t20i century off 35 balls

Rohit Sharma, India, KL Rahul, MS Dhoni, david miller, INDvSL, sports news, sports, cricket news, cricket, today match, today match score, today match updates

Rohit Sharma scored his second T20I century off just 35 balls as India piled on the misery on the Sri Lankan bowlers during the second T20 at the Holkar in Indore.

రోహిత్ శర్మ మరో రికార్డు.. అదుర్స్..

Posted: 12/22/2017 07:59 PM IST
Rohit sharma slams joint fastest t20i century off 35 balls

ఇండోర్‌ వేదికగా హోల్కర్‌ స్టేడియంలో పర్యాటక జట్టు శ్రీలంకతో జ‌రుగుతోన్న రెండో టీ20 మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన బ్యాటు నుంచి పరుగుల సునామీని సృష్టించాడు. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకున్న తరుణంలో మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ టీ20లలో అత్యంత వేగంగా శతకాన్ని నమోదు చేశాడు.

23 బంతుల్లో అర్థశతకాన్ని నమోదు చేసిన రోహిత్ శ‌ర్మ.. ఆ తరువాత మరో 12 బంతుల్లో మరో యాభై పరుగులను జోడించి తన శతకాన్ని నమోదు చేసుకున్నాడు. దీంతో మెరుపు వేగంతో అత్యంత వేగంగా శతకాన్ని పూర్తి చేసుకన్న బ్యాట్స్ మెన్ గా రికార్డును సమం చేసుకున్నాడు. 11 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీని పూర్తి చేసుకునే క్రమంలో స్టేడియం మొత్తం రోహిత్ రోహిత్ అంటూ మార్మోగిపోయింది.

ఇంత‌వ‌ర‌కు దక్షిణాఫ్రికా ఆట‌గాడు డేవిడ్ మిల్ల‌ర్ పేరిట ఉన్న టీ20ల్లో వేగ‌వంత‌మైన సెంచ‌రీ రికార్డును రోహిత్ శ‌ర్మ స‌మం చేశాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ ఈ ఫీటును సాధించగా, శ్రీలంకతో ఇవాళ ఇండోర్ లో జరిగిన మ్యాచులో రోహిత్ 35 బంతుల్లోనే సాధించి మిల్లర్ స్కోరును సమం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs sri lanka  Rohit Sharma  India  KL Rahul  MS Dhoni  david miller  sport  cricket  

Other Articles