Rohit Sharma's six-hitting skills are at a peak రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు

Rohit sharma s six hitting skills are at a peak

Cricket, ODI, India v/s New Zealand, Ind vs NZL, New Zealand, India vs New Zealand 2017, Rohit sharma, kanpur, Virat Kohli, Rohit Sharma, most sixes, Team India, cricket, sports news, sports, latest sports news, cricket news, cricket

Rohit Sharma has hit 33 sixes in 2017, more than any other batsman this year. The India opener has been in prolific ODI form since 2013 when he started opening the innings.

రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు

Posted: 10/31/2017 04:55 PM IST
Rohit sharma s six hitting skills are at a peak

టీమిండియా వన్డే జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేలలో శరవేగంగా 150 సిక్సర్లను తన ఖాతాలో వేసుకున్న క్రికెటర్ గా నిలిచాడు. అంతేకాదు.. అత్యంత తక్కువ ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్ గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. కాన్పూర్ వేదికగా నిన్న న్యూజీలాండ్ తో జరిగిన తన 171 మ్యాచ్ ల్లో 165 ఇన్నింగ్స్ ల్లో రోహిత్ 150వ వన్డే సిక్సర్ ను సాధించాడు.

ఇది భారత తరపున వేగవంతమైన మైలురాయి. న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్ లో రెండు సిక్సర్లు సాధించిన రోహిత్ శర్మ.. 150 సిక్సర్ల క్లబ్ లో చేరిపోయాడు. ఓవరాల్ గా చూస్తే ఈ ఫీట్ ను తక్కువ ఇన్నింగ్స్ ల్లో సాధించిన రెండో క్రికెటర్ రోహిత్ శర్మ. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది తొలి స్థానంలో ఉన్నాడు. 160 ఇన్నింగ్స్ ల్లోనే 150 సిక్సర్ల మార్కును చేరి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక 192 ఇన్నింగ్స్ ల్లో 150 సిక్సర్ల మార్కును చేరిన మహేంద్ర సింగ్ ధోని భారత తరపున రెండో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్ గా ఈ ఫీట్ ను తక్కువ ఇన్నింగ్స్ ల్లో సాధించిన ఐదో క్రికెటర్ ధోని. ఇక్కడ ఏబీ డివిలియర్స్ మూడో స్థానంలో, క్రిస్ కెయిన్స్ నాల్గో స్థానంలో ఉన్నారు. వీరిలో ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ధోని, ఏబీ డివిలియర్స్ లు రెండొందల వన్డే సిక్సర్లను దాటిన ఆటగాళ్లు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs New Zealand 2017  kanpur  Rohit sharma  Record  Virat Kohli  cricket  

Other Articles