Sehwag retaliates, Sachin caught off guard బర్త్ డే రోజున కూడా తనదైన స్టయిల్ లోనే వీరూ..

Virender sehwag retaliates sachin tendulkar caught off guard

virender sehwag, sachin tendulkar, virender sehwag birthday, virender sehwag sachin tendulkar, sehwag birthday, sachin tendulkar, mohammad kaif, vvs laxman, harbhajan singh, cricket news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

Hailed as the ‘Nawab of Najafgarh,’ Sehwag is quiet the entertainer in terms of social media posts. Also a part time off-break bowler, he often bowls over people with his tweets and posts.

బర్త్ డే రోజున కూడా తనదైన స్టయిల్ లోనే వీరూ..

Posted: 10/20/2017 06:58 PM IST
Virender sehwag retaliates sachin tendulkar caught off guard

వినూత్న ట్వీట్లకు టీమిండియా డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పెట్టింది పేరు. అలాంటిది కనీసం ఆయన తన పుట్టిన రోజునైనా వచ్చిన ట్విట్లకు సరిగ్గా సమాధానం చెబుతారా..? లేక ఈ రోజు కూడా జోరుగా హుషారు కలిగిస్తారా అంటే.. రెండోదే చేశారాయన. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తరువాత.. తన సహచరులతో పాటు సామాజిక అంశాలపై, యావత్ దేశ ప్రజలకు సంబంధించిన అంశాలపై ట్విట్టర్ ద్వారా సెకెండ్ ఇన్నింగ్స్ కు వెల్ కమ్ చెప్పిన సెహ్వాగ్.. ప్రాసను కొనసాగిస్తూ.. తనదైన శైలిలో చమత్కారాన్ని కూడా అద్ది మరీ వేడి వేడి ట్విట్లను వడ్డిస్తాడు.

కాగా ఈ సారి సచిన్ టెండుల్కర్ పై తన వాగ్భాణాలను విసిరాడు వీరేంద్రుడు. వీరేంద్ర సెహ్వాగ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న ట్విట్ట‌ర్ ఖాతా బ‌ర్త్‌డే విషెస్‌ల‌తో నిండిపోయింది. క్రికెట్ ఆట‌గాళ్లు, ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు, అభిమానులు ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌దైన శైలిలో సెహ్వాగ్‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. సెహ్వాగ్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచేస్తూ మీమేలు, ఫొటోలు, క‌విత్వాలు, పంచ్‌లైన్లు షేర్ చేశారు. కానీ వారంద‌రిలోకెల్లా మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ చేసిన ట్వీట్ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది.

`హ్యాపీ బ‌ర్త్‌డే వీరూ... హావ్ గ్రేట్ స్టార్ట్ టు ద న్యూ ఇయ‌ర్‌.. మైదానంలో నేను చెప్పిన దానికి నువ్వు ఉల్టాగా (వ్య‌తిరేకంగా) చేసేవాడివి. అందుకే నీకోసం ఇలా!` అంటూ ట్వీట్‌లో అక్ష‌రాల‌ను తిర‌గేసి రాశాడు. ఈ ట్వీట్‌కి వెంట‌నే వీరూ ఫ‌న్నీగా రిప్లై ఇచ్చాడు. `థ్యాంక్యూ గాడ్ జీ (దేవుడా), పైవాడు అన్నీ గ‌మ‌నిస్తూనే ఉంటాడ‌ని ఇప్ప‌టి వ‌ర‌కూ విన్నాను. ఆయ‌న కింద ఉన్న వాళ్ల‌కు ఎలా రాస్తాడోన‌ని ఇవాళ అర్థమైంది` అని సెహ్వాగ్ ట్వీటాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virender sehwag  birthday wishes  sachin tendulkar  twitter  cricket  

Other Articles