Warner rubbishes Hogg's favouritism accusation మాజీ కెప్టెన్ అరోపణలపై స్మీత్ కు వార్నర్ మద్దతు..

David warner rubbishes rodney hogg s favouritism accusation

India vs australia, Team India, David warner, virat kohli, steve smith, bhuvneshwar kumar, jasprit bumrah, india cricket team, India v Australia,Bumrah,Steve Smith,Smith,Pandya,Jasprit Bumrah,Bhuvneshwar Kumar,Bhuvneshwar,Adam Zampa, australia vs india, cricket news, sports news, sports, cricket

Australia's opening batsman David Warner on Wednesday brushed aside former fast bowler Rodney Hogg's accusation that skipper Steve Smith prefers to "pick his friends" in the national team.

టీమిండియాపై ఖచ్చితంగా సత్తా చాటుతాం: డేవిడ్ వార్నర్

Posted: 09/27/2017 09:16 PM IST
David warner rubbishes rodney hogg s favouritism accusation

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ పై ఆ దేశ మాజీ క్రికెటర్ రోడ్నీహాగ్ గుప్పించిన విమర్శలను అంతే సమర్థవంతంగా తిప్పకొట్టాడు జట్టు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. తాజాగా టీమిండియా పర్యటనలో సిరీస్ ఓటమిని చవిచూసిన అసీస్ కెప్టెన్ స్మిత్ ను టార్గెట్ చేసిన హాగ్ విమర్శలు గుప్పించగా వార్నర్‌ జట్టు కెప్టెన్ కు మద్దతుగా నిలిచారు. జట్టులోకి తన స్నేహితులను ఎంపిక చేస్తున్నాడని రోడ్నీ చేసిన వ్యాఖ్యలపై వార్నర్ స్పందించారు. ప్రతి ఒక్కరు అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. కానీ వారి ఉద్దేశ్యాలను మా పై ఎందుకు రుద్దుతున్నారో తెలియడం లేదని వ్యాఖ్యానించాడు.

జట్టును సెలక్టర్లు మ్యాచ్ ముందు రోజు ఎంపిక చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందేనని, అయితే జట్టు ఎంపిక ఆటగాళ్ల చేతిలో లేదన్న విషయం కూడా వారు తెలుసుకోవాలని అన్నాడు. అయితే జట్టులో స్థానం సంపాదించిన అటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చాలని అలా కానీ పక్షంలోనే పరాజయాలు మూటగట్టుకోక తప్పదని అన్నాడు. ఇక వరుస వన్డేల్లో ఓడి సిరీస్ చేజారడం పట్ల రోడ్నీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్మిత్ తన జాతీయ టీమ్ మెట్స్ ను జట్టులోకి తీసుకుంటున్నాడని ఆరోపించారు.

ఇదిలావుండగా, ఇప్పటికే ముగిసిన మూడు వన్డేల్లో ఓడి మిగిలిన వన్డేల్లోనూ విజయాన్ని అందుకోవాలని చూస్తున్న టీమిండియాకు వార్నర్ హెచ్చరికలు జారీ చేశాడు. మిగిలిన వన్డేలతో పాటు టీ 20 సీరీస్ లలోనూ టీమిండియాకు ఆస్ట్రేలియా గట్టిపోటీనిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. వన్డే సిరీస్ చేజారడం నిరాశను కలిగించినా.. అపజయాలు చుట్టుముట్టినప్పుడే గెలుపు పిలుపు వినిపిస్తుందని.. రానున్న రెండు వన్డేలతో పాటు మూడు టీ20ల మ్యాచులలో గెలుపుపై దృష్టి సారించామని అన్నాడు. నవంబరు 23 నుంచి ఇంగ్లాండ్ తో జరగనున్న ప్రతిష్ఠాత్మక యాసెష్ సిరీస్‌‌ లో బరిలోకి దిగుతున్న తాము భారత్ లో కచ్చితంగా సత్తా చాటుతామని వార్నర్ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs australia  Team India  David warner  steve smith  india cricket team  cricket  

Other Articles