Mithali Raj shines on Vogue's tenth anniversary cover మిథాలీ రాజ్. దీపికలకు వోగ్ మహిళా అవార్డులు

Mithali raj women s cricket captain win vogue awards

Mithali Raj, Indian women's cricket team, cricket, Vogue, Shah Rukh Khan, Nita Ambani, Vogue awards, Vogue Women of the Year awards, australia vs india, cricket news, sports news, sports, cricket

Mithali Raj has been kept busy ever since she returned from the UK in July. The Indian women’s cricket team captain has been the cynosure of all eyes and has been under the spotlight

మిథాలీ రాజ్. దీపికలకు వోగ్ మహిళా అవార్డులు

Posted: 09/26/2017 05:22 PM IST
Mithali raj women s cricket captain win vogue awards

టీమిండియ క్రికెట్ అంటే మన దిగ్గజ క్రికెటర్లను ప్రపంచమంతా ఎటా గుర్తిస్తుందో.. అచ్చంగా అలానే.. ఇప్పుడు టీమిండియా మ‌హిళ‌ా క్రికెట్ అనగానే కెప్టెన్ మిథాలీ రాజ్, గోస్వామి, హర్మన్ ప్రీత్ సింగ్, ఇలా మహిళా క్రికెటర్లు కూడా ఇప్పడు ప్రపంచ అభిమానులకు గుర్తుకువస్తారు. ఎందుకంటే ఇటీవల జరిగిన మహిళా ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ లో భార‌త మహిళా జ‌ట్టు ప్రదర్శించిన అద్భుత ప్రతిభ క్రికెట్ అభిమానులను అంతగా అకర్షించింది. వారి ప్రతిభ కారణంగానే అస్ట్రేలియా జట్టను ఓడించి ఫైనల్స్ వరకు చేరిన జట్టు.. తుదిపోరులో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైనా యావత్ ప్రపంచ అభిమానుల హృదయాలను మాత్రం గోలుచుకుంది.

రన్నర్ అప్ గా నిలిచిన టీమిండియా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కు మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. ప్రముఖ ఫ్యాష‌న్ మేగ‌జైన్ 'వోగ్' తమ భార‌త సంచిక‌పై  పదేళ్ల వార్షికోత్సవ వేడుకల సందర్బంగా ఇచ్చిన అవార్డులలో మిథాలీ రాజ్ కు అవార్డు లభించింది, ఈమెతో పాటు అర్చర్ దీపాకా కుమారీకి కూడా అవార్డు లభించింది. దీంతో అమె ఫోటోను కూడా వోగ్ మ్యాగజీన్ తన కవర్ పేజీపై ప్ర‌చురించింది. అక్టోబ‌ర్ నెల సంచిక కోసం మూడు ర‌కాల క‌వ‌ర్ పేజీల‌ను వోగ్ ఇండియా విడుద‌ల చేసింది. వీటిలో ఒక క‌వ‌ర్ పేజీ మీద మిథాలీ రాజ్, షారుక్ ఖాన్, నీతా అంబానీల ఫొటోల‌ను ప్ర‌చురించింది.

మిగ‌తా రెండు క‌వ‌ర్ పేజీల మీద ప్రియాంక చోప్రా, అనుష్క శ‌ర్మ‌, సోన‌మ్ క‌పూర్‌, ట్వింకిల్ ఖ‌న్నా, క‌ర‌ణ్ జొహార్‌, ప‌ద్మాల‌క్ష్మి, ర‌ష్య‌న్ మోడ‌ల్ న‌టాలియా వొడియానోవా చిత్రాల‌ను ప్ర‌చురించింది. `విమెన్ ఆఫ్ ద ఇయ‌ర్ అండ్ ద మెన్ వియ్ ల‌వ్‌` పేరుతో వీరి చిత్రాల‌ను వోగ్ ఇండియా ప్ర‌చురించింది. బాలీవుడ్ సెల‌బ్రిటీలు, వ్యాపార‌వేత్త‌ల స‌ర‌స‌న మిథాలీ స్టార్ గా ఎద‌గ‌డానికి అమె ఎంచుకున్న రంగంలో కనబర్చిన ప్రతిభ దోహదపడిందనే చెప్పాలి. అయితే అంతకుముందు జరిగిన వేడుకల్లో మిథాలీతో పాటు అర్చర్ దీపికా కుమారీ అవార్డులను గెలుచుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles