I'm glad for doing well says Hardik Pandya ఆల్ రౌండ్ ప్రతిభతో రాణిస్తున్నా..

I m doing well in batting and bowling departments says hardik pandya

India vs Australia, Ind vs Aus, hardik pandya, bcci, cricket, ind vs aus 2017 schedule, india tour of australia 2017, india vs australia, india vs australia 2017 odi, india vs australia 2017 schedule, india vs australia odi series, india vs australia odi series 2017, india vs australia schedule 2017 odi, indian cricket team, kedar jadhav, mahendra singh dhoni, ms dhoni, team india, chennai, chidambaram stadium

Hardik Pandya meted out special treatment to Adam Zampa, taking the young leg-spinner to the cleaners on three consecutive occasions to get to his third ODI fifty off 48 balls before falling to the same bowler, later in the innings.

ఆ బౌలర్ ను టార్గెట్ చేయడం వర్కవుట్ అయ్యింది

Posted: 09/18/2017 05:31 PM IST
I m doing well in batting and bowling departments says hardik pandya

అదిలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో వున్న టీమిండియాను విజయతీరాలకు నడిపించిన వారిలో పాండ్యా ఒకడు. తొలి వన్డే మ్యాచులో ఆల్ రౌండ్ ప్రదర్శనతో హార్థిక్ పాండ్యా దుమ్మురేపాడు. 66 బంతుల్లో 83 పరుగులు చేసి బ్యాటింగ్ లో అదరగొట్టిన పాండ్యా.. ఆ తర్వాత బౌలింగ్ లో కీలకమైన స్టీవ్ స్మీత్‌, ట్రావిస్ హేడ్ వికెట్లు పడగొట్టాడు. అసీస్తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో తొలి వన్డేలో అలవోక విజయం సాధించడం కీలకంగా మారాడు.

అంతేకాదు తొలి వన్డేలో 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' సొంతం చేసుకున్న పాండ్యా ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఇది చాలా మంచిరోజని పేర్కోన్నాడు. కొన్ని క్యాచులు కూడా పట్టి ఉంటే అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ రాణించి అన్ని విభాగాల్లో రాణించిన అల్ రౌండర్ గా వుండేవాడినని అన్నాడు. అయితే కనీసం బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాలోనైనా రాణించనందుకు తనకు సంతోషంగా వుందని అన్నాడు. తాను పెద్దగా మారిందేమీ లేదని, తాను పాత హర్థిక్ నేన్నాడు. అయితే గత ఏడాదికన్నా కొంత శాంతగా మారి వుండవచ్చునన్నాడు.

స్పిన్నర్ ఆడం జంపా బౌలింగ్ ను టార్గెట్ చేయాలని ధోనితో పాటు తాను ముందుగానే ప్రణాళిక రచించుకున్నాని చెప్పాడు. అయితే అనుకున్నట్లుగానే జంపా బౌలింగ్ కు రాగానే టార్గెట్ చేశామని చెప్పాడు. అతని బౌలింగ్ లో పాండ్యా వరుసగా మూడు సిక్సర్లు కొట్టి అలరించడానికి ముందస్తు ప్రణాళికే కారణమని చెప్పాడు. అయితే తమ ప్లాన్ అచ్చంగా అమలయ్యిందని.. అతని ఓవర్లో పరుగులు పిండికున్నామని పాండ్యా చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Australia  dhoni  Hardik pandya  chennai  chidambaram stadium  cricket  

Other Articles