Indian Under-17 Cricketer Drowns in Sri Lanka లంక టూర్లో విషాదం.. యువ క్రికెటర్ దుర్మరణం..

Indian u 17 cricketer drowns in sri lankan swimming pool

under-17 indian cricketer, indian cricketer drowned, Indian cricket team, Indian U-17 cricketer, Monath Sona Narendra, Sri Lanka, dead, drowns, Surat, gujarat, sports news, cricket,

At a time when team India was on a record high against the Sri Lanka, a 12-year-old Indian cricketer from Gujarat drowned in a swimming pool in Pamunugama, a beach resort in Negombo.

లంక టూర్లో విషాదం.. యువ క్రికెటర్ దుర్మరణం..

Posted: 09/07/2017 03:55 PM IST
Indian u 17 cricketer drowns in sri lankan swimming pool

భారత భావి క్రికెటర్ గా మన్ననలు అందుకోవాల్సిన ఓ యువ క్రికెటర్.. శ్రీలంక పర్యటనకు వెళ్లి అసువులు బాసిన ఘటన విషాదాన్ని నింపింది. భారత అండర్ 17 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ టీనేజ్ క్రికెటర్.. శ్రీలంక పర్యటనలో భాగంగా అక్కడకు వెళ్లి.. ఈత రాకపోయానా.. ఈతకొలను దిగడంతో ప్రాణాలు కోల్పోయాడు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణానికి చెందిన మోనత్ సోనా నరేంద్ర (12) ఏళ్ల ఆటగాడు ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ఓ టోర్నమెంటు కోసం ఆడేందుకు వచ్చాడు. ఆతడితో మరో 19 మంది అండర్ 17 బృందం శ్రీలంకలో ఉన్నారు.
 
కాగా మంగళవారం వీరు బస చేసిన పామునుగామాలోని ఓ హోటల్లో మొత్తం నలుగురు ఆటగాళ్లు ఈతకొలనులోకి దిగారు. బాధిత టీనేజ్ క్రికెటర్ నీటిలో మునిగిపోవడంతో తోటి క్రికెటర్లు అతడిని బయటికి తీసుకొచ్చి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. ఈత రాకుండానే స్విమ్మింగ్ పూల్ లోకి దిగడం వల్లే ప్రమాదం సంభవించిందని  చెబుతున్నప్పటికీ.. ఇంకా స్పష్టమైన కారణాలు వెల్లడికాలేదు. శ్రీలంక పోలీసులు ఇప్పటికే ఈ ఘటనపై విచారణ చేపట్టారు. నరేంద్ర బౌతికఖాయాన్ని పోస్టుమార్టం కోసం రాగమ టీచింగ్ హాస్పిటల్ కి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian cricket team  Indian U-17 cricketer  Monath Sona Narendra  Sri Lanka  dead  drowns  Surat  gujarat  

Other Articles