Cheteshwar Pujara credits sachin, dravid సచిన్, ద్రావిడ్ లు యువక్రికెటర్లకు స్ఫూర్తి

Cheteshwar pujara i have reached here as my dad coached me

Cheteshwar Pujara, India vs Sri Lanka, Cheteshwar Pujara batting, Cheteshwar Pujara 50th Test, sports news, cricket, news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

Cheteshwar Pujara is all set to play his 50th Test match of career when he would take the field against Sri Lanka in Colombo on August 3 in the second Test match

సచిన్, ద్రావిడ్ లు యువక్రికెటర్లకు స్ఫూర్తి

Posted: 07/31/2017 08:17 PM IST
Cheteshwar pujara i have reached here as my dad coached me

భారత క్రికెటర్‌ ఛతేశ్వర పుజారా టిమిండియా నయా వాల్ గా అవతరించాడు. ఈ క్రమంలో ఆయన అరుదైన ఘనతకు చేరువయ్యాడు. 3 టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్‌-శ్రీలంక మధ్య కొలంబోలో ఆగస్టు 3 నుంచి రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ టెస్టు పుజారాకి 50వది కావడం విశేషం. ఇరు జట్ల మధ్య గాలెలో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పుజారా అద్భుతంగా ఆడి 153 పరుగులు సాధించాడు. ఈ టెస్టులో భారత్‌ ఆతిథ్య లంకపై 304 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

తన ఆటతీరు వివరించడంలో తన తండ్రే తనకు మంచి విమర్శకుడని చెప్పాడు. ఆట పట్ల అతను ఎంతో అంకిత భావం కలవాడని కొన్నిసార్లు తన పట్ల కఠినంగా వ్యవహరించేవాడని కూడా చెప్పాడు. అప్పుడు ఎందుకు అంత కఠినంగా వ్యవహరించేవాడో అర్థమయ్యేది కాదని.. అయితే అది ఇప్పుడు అర్థమౌతోందని వివరించాడు. దేశం తరఫున త్వరలో 50వ టెస్టు ఆడబోతున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగానూ ఉందన్నాడు. తన ఈ ప్రయాణంలో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నానని చెప్పాడు.

తన అటలో రాణించడం కష్టంగా మారిన సమయంలో కొన్ని మార్పులు చేసుకుని ఆటతీరును మార్చుకున్నానని చెప్పాడు. అయితే ఈ విషయమై దివాల్ రాహుల్‌ ద్రవిడ్‌తో చర్చించానని, కాగా అతను నా బ్యాటింగ్‌ శైలిని అలాగే కొనసాగించమని సలహా ఇచ్చాడని చెప్పాడు. ఆటపై పట్టు సాధించడం ద్వారా.. రాణించడం సులువవుతుందని కూడా సూచించాడని పూజారా చెప్పాడు. ఆట కోసం కష్టపడటం సచిన్‌, ద్రవిడ్‌ నుంచే నేర్చుకున్నానని యువ ఆటగాళ్లకు వారు ఎంతో స్ఫూర్తినిస్తారని పుజారా తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles