ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వరల్డ్ కప్ లో టీమిండియా మహిళల జట్టు ఫైనల్స్ లోకి దూసుకెళ్లిన నేపథ్యంలో వీరోచిత ఇన్నింగ్స్ అడిన హర్మన్ ప్రీత్ కౌర్ పై క్రీడాకారులు, అభిమానులు, నెట్ జనుల నుంచి ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. కేవలం 115 బంతులలో 20 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 171 పరుగులు సాధించి అజేయంగా నిలిచిన అమె అధ్బుత అటను అభిమానులు ప్రశంసిస్తున్నారు. అయితే ఇలాంటి వీరోచితమైన ఆటను అడి అసీస్ బౌలర్లను బెంబేలెత్తించడానికి కారణం మాత్రం టీమిండియా మాజీ క్రికెటరేనట.
నమ్మశక్యంగా లేకపోయినా ఇది ముమ్మాటికీ నిజమని అమె సోదరి మెమ్ జిత్ తెలిపారు. కౌర్ కు చిన్ననాటి నుంచి టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను బ్యాటింగ్ ఐడల్ గా తీసుకునే అమె అతనిలా బ్యాటింగ్ చేసేందుకు చాలా కష్టపడిందని చెప్పారు. ఆమె ఆరాధ్య క్రికెటర్ సెహ్వాగేనని.. సెహ్వాగ్ ఆటను ఎక్కువగా ఆస్వాదించేదని చెప్పారు. తన ఆటలోనూ సెహ్వాగ్ షాట్లు కనిపించాలన్న తపన అమెలో అధికంగా వుండేదని చెప్పారు. ఇక హర్మన్ రోల్ మోడల్ విషయానికొస్తే అమెకు తమ నాన్న హర్మందర్ సింగ్ తొలి కోచ్ అని తెలిపారు.
కాగా కౌర్ అద్బుత అటను ప్రశంసిస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ‘వాట్ ఏ ఇన్నింగ్స్ కౌర్.. బౌలర్ల ప్రదర్శన అద్భుతమని’ ట్వీట్ చేయగా.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అద్బుతమైన బ్యాటింగ్ కౌర్.. విజయం దిశగా పయనించండి అని ట్వీట్ చేశాడు. సింగిల్ హ్యాండ్ తో గెలిపించే మ్యాచులు చూసి చాల రోజులైందని సంజయ మంజ్రేకర్ కౌర్ ప్రదర్శనను కొనియాడాడు. ఇక ట్వీటర్ వీరుడు.. సెహ్వాగ్ కౌర్ జీవితాంతం గుర్తుండిపోయే ఇన్నింగ్స్.. అద్భుతమైన హిట్టింగ్ అంటూ ట్వీట్ చేశాడు. కౌర్ రాక్ స్టార్ అని భారత్ హెడ్ కోచ్ రవిశాస్త్రీ.. ప్రశంసించగా.. మహిళల ప్రపంచకప్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ అని కైఫ్ హర్మన్ ను కొనియాడాడు.
వీరితో పాటుగా జస్ప్రీత్ బుమ్రా, సురైశ్ రైనా, శిఖర్ ధావన్ లు కౌర్ సహా మిథాలీసేనను అభినందిస్తూ ప్రశంసల జల్లు కురిపించారు. ఇక అభిమానులు ఇటు కౌర్ తో పాటుగా టీమిండియా మహిళా క్రికెట్ జట్టుకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ తమ అభిమానాని చాటుకుంటున్నారు. ఇంగ్లండ్ తో జరిగే ఫైనల్ లో భారత మహిళలు విజయం సాధించి ప్రపంచ కప్ సాధిస్తారని ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్ తరుపున వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాట్స్ ఉమెన్ గా కౌర్ నిలిచింది. తొలి స్థానంలో దీప్తిశర్మ(188 నాటౌట్) కొనసాగుతుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more