Rahul Dravid coach contract extended for two-years కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం పోడగింపు

Rahul dravid offered a two year u 19 india a contract

rahul dravid, dravid, bcci, u-19, india a, dravid contract extended, dravid u-19 coach, Anil Kumble, Committee of Administrators, cricket news, cricket, sports news, latest news

Rahul Dravid looks all set to continue as coach of the India ‘A’ and Under-19 teams as his contract has been renewed for two more years.

కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం పోడగింపు

Posted: 06/20/2017 06:46 PM IST
Rahul dravid offered a two year u 19 india a contract

రాహుల్ ద్రావిడ్. ది వాల్ గా ప్రసిద్ది చెందిన మాజీ టీమిండియా కెప్టెన్.. తన పదవీకాలం తరువాత టీమిండియా భావితరాల జట్లను తీర్చిదిద్ది వారికి మెలకువలను నేర్పే పనిలో వున్నారు. అదేనండీ భారత అండర్ -19, భారత్ -ఎ క్రికెట్ జట్లకు కోచ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన పదవికాలం ముగిసిపోతున్న క్రమంలో టీమిండియా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి అంక్షలు విధించినట్లుగా.. ఎలాంటి మెలికలు లేకుండా బిసిసిఐ పరిపాలన కమిటీ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించింది.

ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండర్ -19, భారత్ -ఎ క్రికెట్ జట్టు కోచ్ ను ఎంపిక చేసే క్రమంలో కూడా ఇంటర్య్వూలో నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో అలాంటి వాటిని దూరంగా పెట్టిన బిసిసిఐ రాహుల్ ద్రావిడ్ తన సత్తాను ప్రూవ్ చేసుకున్నాడని, అతని శిక్షణలో అనేక మంది యువ క్రికెటర్లు సత్తా చాటేందుకు రెడీ అయ్యారని భావించిన బిసిసిఐ ద్రావిడ్ పదవీ కాలాన్ని పొడిగించింది.

అయితే ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించే క్రమంలో ముందుగా భావించినట్లు ఎలాంటి షరతులు, ఇంటర్వ్యూలు లేకుండా ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకుంది. భారత్ యువ క్రికెటర్లకు ద్రవిడ్ మార్గదర్శకం అవసరమని బీసీసీఐ భావిస్తోంది. దాంతో అతన్నే తిరిగే ఎంపిక చేసే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కాగా, భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కోచ్ పదవిలో కుంబ్లేను కొనసాగిస్తారా లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Dravid  BCCI  Anil Kumble  Committee of Administrators  India U19 coach  sports  cricket  

Other Articles