స్టీవ్ స్మిత్ డబుల్ గేమ్.. కోహ్లీయే మళ్లీ టార్గెట్ Ajinkya Rahane is more chilled out than Virat Kohli: Steve Smith

Ajinkya rahane is more chilled out than virat kohli steve smith

india vs australia, steve smith, virat kohli, Ajinkya Rahane, india, australia, Team India, india australia Dharamsala Test, india australia Dharamsala Test, latest sports news, indian cricket team, news, sports, cricket news, cricket

Australia cricket team skipper Steve Smith thinks that India will be in good hands under Ajinkya Rahane’s captaincy should Virat Kohli miss the Dharamsala Test due to an injured shoulder.

స్టీవ్ స్మిత్ డబుల్ గేమ్.. కోహ్లీయే మళ్లీ టార్గెట్

Posted: 03/24/2017 06:57 PM IST
Ajinkya rahane is more chilled out than virat kohli steve smith

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరోసారి తన డబుల్ గేమ్ ప్రదర్శనను బయటపెట్టాడు. ఈ సారి కూడా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే టార్గెట్ చేసుకున్నాడు. రాంచీ టెస్టులో గాయపడిన విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ అయన జట్టులో లేకున్నా ఏం పర్వాలేదని వ్యంగంగా వ్యాఖ్యలు చేశారు. అసీస్ తో సిరీస్‌లో ఇప్పటికే బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైన కోహ్లీ, టెస్ట్ కెరీర్‌లోనే తక్కువ సగటుకు పడిపోవడాన్ని దృష్టిలో పెట్టుకున్నాడో ఏమె కానీ అతను లేకున్నా జట్టుపై ప్రభావం ఏమాత్రం వుండదు అన్నట్లు అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు.

కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ కన్నా వైస్ కెప్టెన్ రహానేనే బెస్ట్ అంటూ కితాబిచ్చి.. టీమిండియా టీమ్ స్పిరిట్ ను విచ్చిన్నం చేయాలని కుట్రలకు పునాది వేశాడు. ఆటగాడిగానూ, కెప్టెన్‌గానూ రహానే ఎంతో తెలివిగా వ్యవహరించడం తాను గమనించినట్లు చెప్పాడు. నాల్గవ టెస్టులో కోహ్లీ అడకపోయినా టీమిండియాకు జరిగే నస్టమేమి లేదని పేర్కోన్నాడు. అసలెందుకు రహానే నచ్చాడా అంటూ అడిగితే.. అతను కోహ్లీలో ఉద్వేగానికి లోను కాకుండా గేమ్ ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడని అన్నాడు.

అయితే బోర్డర్-గవాస్కర్ సిరీస్ సిరీస్‌లో 1-1 తో సమ ఉజ్జీగా ఉన్నామని, ధర్మశాలలో ఫలితం ఎలా వస్తుందో ఇప్పుడే చెప్పలేమని కూడా వ్యాక్యానించాడు. మ్యాచ్ ఫలితం ఎలా వచ్చినా అంగీకరించేందుకు జట్టు సిద్ధమని చెప్పుకోచ్చాడు.. భారత్‌ను సోంత గడ్డపై ఓడించడం చాలా కష్టమని అన్నాడు. ఏది ఏమైతేనేం ఈ సమ్మర్‌లో మంచి క్రికెట్‌ను ఆడినందుకు హ్యాపీగా ఉన్నానని చెప్పుకోచ్చాడు. రహానే, స్టీవ్ స్మిత్ ఇద్దరూ ఐపీఎల్‌లో ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌ తరపునే ఇద్దరు అడిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  steve smith  virat kohli  Ajinkya Rahane  india  australia  Team India  Dharamsala  cricket  

Other Articles