నిర్ణయ సమీక్షలో కోహ్లీ కెప్టెన్సీ వెనుకంజ DRS: India get 17 out of 55 calls right

Drs india get 17 out of 55 calls right under virat kohlis captaincy

india a vs australia, india a vs australia warm-up game, DRS, india a vs australia pune match, ind a vs aus 2017, australia, india vs australia test 2017, virat kohli, ashwin, jadeja, steve smith, cricket news, cricket

India have got only 17 correct decisions out of the 55 referrals that they have taken in seven Tests. This comprise both batting and fielding statistic and the success percentage comes to a mere 30.9 percent.

నిర్ణయ సమీక్షలో కోహ్లీ కెప్టెన్సీ వెనుకంజ

Posted: 02/28/2017 06:53 PM IST
Drs india get 17 out of 55 calls right under virat kohlis captaincy

ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమి తరువాత విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా జట్టు అనేక విమర్శలను ఎదుర్కొంటుంది. ప్రధానంగా  అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ను భారత జట్టు వినియోగించుకునే విధానమే అనేక సందేహాలకు తెరలేపింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో భారత జట్టు అనవసరపు రివ్యూలను కోరి మూల్యం చెల్లించుకోవడమే ఇక్కడ చర్చకు దారి తీసింది. ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేసి థర్డ్ అంపైర్ నిర్ణయానికి వెళ్లడమంటే ఆటగాళ్లకు ముందు చూపు చాలా అవసరం.

ముఖ్యంగా ఎల్బీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా ఫీల్డ్ అంపైర్లు ఇచ్చే ఎల్బీ డబ్యూ నిర్ణయాలు దాదాపు కచ్చితంగానే ఉండటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. మరి ఆ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసే ముందు బ్యాట్స్మన్ కు కొద్దిగొప్పో పరిజ్ఞానం అవసరం.  అది ఎల్బీ అని తెలిసినా తన వికెట్ ను కాపాడుకోవడం కోసం డీఆర్ఎస్ కు వెళితే మాత్రం ఫలితం శూన్యంగానే ఉంటుంది. మొన్నటి ఆసీస్ టెస్టులో జరిగింది కూడా అదే.

భారత రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్ లు ఎల్బీ విషయంలో రివ్యూకు వెళ్లి విఫలమయ్యారు. కనీసం ఆ రివ్యూకు వెళ్లే ముందు బంతి వెళ్లే దిశను కనీసం అంచనా వేయకుండానే అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఇక్కడ తమ వికెట్ ను కాపాడుకునే ప్రయత్నమే మన ఓపెనర్లు చేసినట్లు కనబడింది. ఆ రెండు రివ్యూలు తొలి  ఆరు ఓవర్లలో కోల్పోవడంతో ఆపై భారత్ కు గట్టి ఎదురుదెబ్బ  తగిలింది. ఆ తరువాత చటేశ్వర పూజారా, వృద్ధిమాన్ సాహాలు కూడా ఎల్బీగా అవుటైన తరుణంలో డీఆర్ఎస్ ను ఇక వినియోగించుకునే అవకాశం భారత్ కు లేదు. ఒకవేళ ఆ సమయంలో డీఆర్ఎస్ ఉంటే మాత్రం వారు నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం దొరికేది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  team india  DRS  Australia  Virat kohli  Steven Smith  Mumbai  cricket  sports news  cricket  

Other Articles