విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై ధోని ఏమన్నాడో తెలుసా..? Indian cricket team will rewrite history, says MS Dhoni

Indian cricket team will rewrite history says ms dhoni

dhoni, ms dhoni, former captain ms dhoni, captain ms dhoni, india odi captain, india vs england, india vs england, india new jersey, india vs england series, india vs england first odi, cricket news, sports news

Dressed in India’s new jersey, Dhoni was speaking publicly for the first time since resigning from his post as India’s limited overs captain said current Indian side will rewrite history or do something special in the future.

విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై ధోని ఏమన్నాడో తెలుసా..?

Posted: 01/13/2017 06:31 PM IST
Indian cricket team will rewrite history says ms dhoni

టెస్టు ఫార్మెట్ అ తరువాత తాజాగా లిమిటెడ్ ఓవర్స్ ఫార్మెట్ల కెప్టెన్పీ పగ్గాలను టిమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీకి అందించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తొలిసారిగా ఈ విషయమై స్పందించారు. ముందుగా తన భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది వెల్లడించిన ఆయన టీమిండియా కెప్టెన్ గా పగ్గాలను అందుకున్న విరాట్ కోహ్లీకి అన్ని ఫార్మాట్లలో జట్టును నడిపించే సత్తా ఉందని కొనియాడాడు. ప్రస్తుతం వున్న టీమిండియా జట్టులో కోనసాగుతున్న అటగాళ్లకు ప్రపంచ రికార్డులను తిరగరాసే సత్తా వుందని చప్పాడు.

వన్డేలకు ఒకరు, టెస్టులకు మరొకరి కెప్టెన్సీతో జట్టుకు ఎలాంటి ఉపయోగం ఉండదని, అన్ని ఫార్మాట్లకు ఒక్క కెప్టెన్ ఉండటం జట్టుకు కలిసొస్తుందని ధోనీ అభిప్రాయపడ్డాడు.  ఇక నుంచి కేవలం బ‍్యాటింగ్ పైనే తాను దృష్టి సారించనున్నట్లు ధోనీ వెల్లడించాడు. ఓవరాల్ గా పదేళ్ల కెప్టెన్సీ జర్నీని ఎంతో ఎంజాయ్ చేశానని, తన సంతోషానికి కారణం అదేనన్నాడు. ఇటీవల కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీతో జట్టు గురించి చర్చించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాడు.

టెస్టు ఫార్మాట్ నుంచి కోహ్లీని పరిమిత ఓవర్ల క్రికెట్ లో తీసుకునే నిర్ణయాలపై చర్చించున్నట్లు తెలిపాడు. అన్ని ఫార్మాట్లలో గెలిచే సత్తా ఉన్న ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారని కొనియాడాడు. ముఖ్యంగా ఫీల్డింగ్ పొజిషన్ ఎలా సెట్ చేయాలి.. దీనిపై కోహ్లీ ప్రణాళికలు తెలుసుకుంటానని తన మద్ధతు కచ్చితంగా కోహ్లీకి ఉంటుందని మాజీ కెప్టెన్ ధోనీ పేర్కొన్నాడు. ఈ 15న ఇంగ్లండ్ తో తొలి వన్డేలో కోహ్లీ నేతృత్వంలో ధోనీ ఆడనున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ms dhoni  virat kohli  team india  indian current team  india vs england  india new jersey  cricket  

Other Articles