భారత దిగ్గజాలపై పాక్ పేసర్ ప్రశంసలు Dravid, Laxman Were the Best Batsmen: Mohammad Asif

Dravid laxman were the best batsmen i bowled to mohammad asif

Australia vs Pakistan 2016, India vs Pakistan, Mohammad Amir, mohammad asif, Rahul Dravid, virender sehwag, vvs laxman, Virat Kohli, sports news, sports, cricket news, cricket

Pakistan's tainted pace bowler Mohammad Asif has described former India stars Rahul Dravid and VVS Laxman as technically the best batsmen he bowled to in his roller-coaster career.

భారత దిగ్గజాలపై పాక్ పేసర్ ప్రశంసలు

Posted: 12/29/2016 06:51 PM IST
Dravid laxman were the best batsmen i bowled to mohammad asif

స్పాట్ ఫిక్సింగ్ అభియోగాలు ఎదుర్కోని.. అవి  నిరూపితం కావడంతో ఐదేళ్ల పాటు బహిష్కరణకు గురై.. తన క్రికెట్ కెరీర్ ను చేజేతులా నాశనం చేసుకున్న పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ అసిఫ్.. భారత దిగ్గజ క్రికెటర్లపై ప్రశంసలను కురిపించాడు. కొత్త బంతితో తన కంటే మెరుగ్గా బౌలింగ్ చేసే వారు ప్రపంచంలోనే ఎవరూ లేరంటా ఇటీవలే తనకు తాను కితాబిచ్చుకున్న పేసర్ తాజాగా భారత దిగ్గజ ఆటగాళ్ల రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్లలతో పాటు వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీలను ప్రశంసలతో ముంచెత్తాడు.

తన కెరీర్లో కఠినమైన ఆటగాళ్లు ఎవరైనా ఉంటే అది ద్రవిడ్, లక్ష్మణ్లేనని స్పష్టం చేశాడు. అయితే తాజాగా విరాట్ కోహ్లీ అటను పరిశీలిస్తుంటే వారే గుర్తుకు వస్తున్నారని అన్నాడు. తన పరంగా చూస్తే ప్రపంచ క్రికెట్ లో ఆ ఇద్దరూ సాంకేతికంగా ఎంతో మెరుగైన ఆటగాళ్లని ఆసిఫ్ పేర్కొన్నాడు. 'రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్లు ఇద్దరూ..ఇద్దరే. టెక్నికల్ గా వారు ఎంతో  నైపుణ్య కల్గినవారు. ఆ ఇద్దరికీ ఆఫ్ స్టంప్ బంతులను వేయాలంటే చాలా భయపడేవాన్ని. వారికి ఆఫ్ స్టంప్ బంతులు వేయడం నాకు ఒక ఛాలెంజ్లా ఉండేది' అని ఆసిఫ్ ఒక ఇంటర్య్వూలో పేర్కొన్నాడు.

మరొకవైపు భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై కూడా ఆసిఫ్ ప్రశంసలు కురిపించాడు. సాంకేతికంగా విరాట్ కోహ్లి చాలా మెరుగైన ఆటగాడని, ఈ క్రమంలోనే అతనికి బౌలింగ్ చేయాలంటే ఏ బౌలరైనా అత్యంత శ్రమించక తప్పదన్నాడు. 2010లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన ఆసిఫ్.. ఐదేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్నాడు. గతేడాది నిషేధం పూర్తి చేసుకున్న ఆసిఫ్.. ఇంకా తిరిగి పాక్ జాతీయ జట్టులో పునరాగమనం చేయలేదు. త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే పాక్ జట్టులో చోటు దక్కించుకునే పనిలో పడ్డాడు ఆసిఫ్. దీనిలో భాగంగా దేశవాళీ మ్యాచ్లు ఆడుతూ సత్తా చాటుకుంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mohammad asif  Rahul Dravid  virender sehwag  vvs laxman  Virat Kohli  cricket  Sport  

Other Articles