ధోనిని కొనసాగిస్తారా.. సాగనంపుతారా..? Is Virat Kohli India’s captain for all formats?

Is virat kohli india s captain for all formats

Virat Kohli, MSK Prasad, MS Dhoni, captaincy 3 formats, Maninder Singh, India v England 2016, England v India, England in India, Aakash Chopra

MS Dhoni is still the right man to lead India in white-ball cricket, or Virat Kohli, is ready to take over in ODIs and T20Is too.

విరాట్ కోహ్లీకే మూడు ఫార్మెట్ల కెప్టెన్సీ పగ్గాలు..?

Posted: 12/14/2016 06:27 PM IST
Is virat kohli india s captain for all formats

టీమిండియా సెలక్షన్ కమిటీ పగ్గాలను చేపట్టిన తెలుగువాడు ఎంఎస్‌కే ప్రసాద్‌ త్వరలో విరాట్ కోహ్లీకి మూడు ఫార్మెట్ల బాధ్యతలను అందిస్తారా..? ఇప్పటి వరకు టెస్టు కెప్టెన్ గా మాత్రమే బాధ్యతలు నిర్వర్తిస్తున్న కోహ్లీ ఇకపై వన్డే, టీ 20 ఫార్మెట్లకు కూడా కెప్టెన్సీ చేపడతారా..? అంటే అవునన్న సమాధానాలే తెరపైకి వస్తున్నాయి. దీంతో టీమిండియా పరిమితి ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి జట్టు బాధ్యతల నుంచి తప్పించే అవకాశముందన్న వార్తలు గత కొన్నాళ్లుగా విపరీతంగా వినిపిస్తున్నాయి. అయితే ధోనిని జట్టులో సభ్యుడిగా కొనసాగిస్తారా..? లేక మొత్తానికి ఉద్వాసన పలుకుతారా..? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.

గత రెండేళ్లుగా టెస్టుల్లో కెప్టెన్‌గా కోహ్లి అసాధారణమైన ప్రతిభను చాటుతున్నాడు. నిజానికి కెప్టెన్‌ అయిన తర్వాతే కోహ్లి మరింత రాటుదేలాడా? అన్న సందేహం కలుగకపోదు అతని ఇటీవలి ఇన్నింగ్స్‌ను చూస్తే.. టెస్టుల్లోనే కాదు వన్డేల్లోనూ సమయం వచ్చిన ప్రతిసారి తనకు తానే సాటి అని కోహ్లి నిరూపించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో 2019లో ఇంగ్లండ్‌లో జరగనున్న వన్డే క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు ఎవరు నాయకత్వం వహించాలన్నది కీలక ప్రశ్నగా మారింది. అందుకు ఇప్పటి నుంచే జట్టును సమాయత్తం చేయాల్సిన అవసరం వున్నందున ఈ ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

అయితే ధోనీ కెప్టెన్‌గా కొనసాగించాలా? లేదా మార్పులు చేయాలా? అన్నది త్వరలోనే తేలిపోయే అవకాశముంది. వచ్చే ఏడాది వేసవిలో ఇంగ్లండ్‌ళో చాంపియన్స్‌ ట్రోపీ నాటికి ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశముంది. అప్పుడే సెలక్టర్లు 2019 వరల్డ్‌ కప్‌ వరకు ఎవరు జట్టు సారథిగా ఉండాలో నిర్ణయించే అవకాశముంది’ అని భారత మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం టెస్టులు అధికంగా ఆడుతున్నారు. దీంతో టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకొన్న ధోనీ సుదీర్ఘకాలం జట్టులో కొనసాగడం కష్టతరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతటి సామర్థ్యమున్న క్రికెటర్‌కు అయినా సత్తా చాటడం అంత సులువైన విషయం కాదన్నాడు. ఈ నేపథ్యంలో ధోనీది చాలా క్లిష్టపరిస్థితే’ అని చోప్రా అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  MSK Prasad  MS Dhoni  India v England 2016  Aakash Chopra  

Other Articles