ఆ టెస్టుకు అలస్యంగా అజార్ కు అహ్వానం.. BCCI invites Mohammad Azharuddin for India's 500th Test

Bcci invites mohammad azharuddin for india s 500th test

bcci india, india bcci, bcci india cricket, Team India, former captains, Mohammad Azharuddin, Rajeev Shukla, 500th test match, india cricket board, india cricket team, indian cricket team, team india, india cricket, cricket news, cricket, sports, sports news

BCCI’s parent body has extended an invitation to Mohammad Azharuddin for the Indian cricket team’s historic 500th Test match and the former captain has accepted it.

చారిత్రాత్మక టెస్టుకు అలస్యంగా అజార్ కు అహ్వానం..

Posted: 09/17/2016 05:50 PM IST
Bcci invites mohammad azharuddin for india s 500th test

టీమిండియా క్రికెట్ ప్రతిష్టాత్మకమైన 500వ టెస్టు మ్యాచ్ ఈ నెల 22న కాన్పూరులో న్యూజిలాండ్‌తో జరగనున్న నేపథ్యంలో.. ఈ చారిత్రక మ్యాచ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన బీసీసీఐ భారత జట్టు మాజీ కెప్టెన్లు అందరినీ ఆహ్వానించింది. కాగా అందరికన్నా అలస్యంగా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్కు ఆహ్వానం అందింది. తొలుత ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అజహర్  పేరును పక్కను పెట్టిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ).. అనేక తర్జన భర్జనల అనంతరం ఈ మాజీ కెప్టెన్ను ఆహ్వానించడానికి నిర్ణయించింది.

అజహర్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఉండటమే అతని పేరును ముందుగా పరిశీలించకపోవడానికి ప్రధాన కారణం. అయితే అజహర్ను పిలవకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉందని భావించిన బీసీసీఐ పేరెంట్ బాడీ.. ఆలస్యంగా అతనికి ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమానికి  ముందుగా మాజీ కెప్టెన్లు నారీ కాంట్రాక్టర్, చందు బోర్డే, దిలీప్ వెంగసర్కార్, కపిల్ దేవ్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, కృష్ణమాచారి శ్రీకాంత్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, అజిత్ వాడేకర్లకు ఆహ్వానం పంపిన తరువాత.. అజహర్ ను ఆహ్వానించే క్రమంలో బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకుంది.

ఈ మేరకు అజహర్ ను ఆహ్వానించిన విషయాన్ని సీనియర్ బీసీసీఐ అధికారి రాజీవ్ శుక్లా ధృవీకరించారు.  అజహర్ ను పిలవడంలో ఎటువంటి తప్పిదం జరగలేదంటూ ఆయన తెలిపారు. అయితే చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ కు సచిన్, వెంగసర్కార్, శ్రీకాంత్, అజహర్లు హాజరు కావడానికి ఇప్పటికే అంగీకారం తెలపగా, అజిత్ వాడేకర్ మాత్రం అనారోగ్యం కారణంగా హాజరుకాలేనని బోర్డుకు తెలిపినట్లు రాజీవ్ శుక్లా తెలిపారు. ఈ టెస్ట్ మ్యాచ్ చరిత్రలో గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాజీవ్ శుక్లా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  former captains  Mohammad Azharuddin  Rajeev Shukla  500th test match  cricket  

Other Articles