India in West Indies 2016: Visitors relax after landing in Kingston ahead of 2nd Test

Confident india arrive in kingston

india vs west indies, west indies vs india, ind vs wi, wi vs ind, india tour of west indies, india cricket, west indies cricket, fifa video game, shikar dhawan, Test series, cricket, sports news, sports

A confident Indian cricket team arrived in Kingston, Jamaica for the second Test against hosts West Indies starting 30 July

ఫుట్ బాల్ మ్యాచ్ అడుతూ టీమిండియా రిలాక్స్

Posted: 07/27/2016 08:51 PM IST
Confident india arrive in kingston

వెస్టిండీస్ను వారి సొంతగడ్డపై తొలి టెస్టులో ఇన్నింగ్స్ 92 పరుగుల భారీ తేడాతో ఓడించిన టీమిండియా ప్రస్తుతం ఫుట్ బాల్ మ్యాచ్ ను తీవ్రంగా అడుతోంది. రెండో టెస్టుకు ఇది ప్రాక్టీసు కాబోలు అనుకుంటే అది పోరబాటే. ఎందుకంటే వారు అడుతున్నది గ్రౌండ్ లో కాదు. వీడియో గేమ్ కాబట్టి, కేవలం నాలుగు రోజుల్లోనే విండీస్ భరతం పట్టిన టీమిండియా ఆటగాళ్లు చాలా సీరియస్గా వీడియో గేమ్ ఆడుతున్నారు. మీరు చూస్తున్నది నిజమేనండీ. ఈ ఫొటోలో భారత క్రికెటర్లు ఏకాగ్రతతో ఆటలో నిమగ్నమయ్యారు.

చతేశ్వర్ పుజారా, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్.. టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి వీడియో గేమ్స్ ఆడారు. శిఖర్ ధావన్ ఈ విషయంపై సరదాగా ట్వీట్ చేశాడు. రెండు జట్లుగా విడిపోయి వీళ్లు ఫుట్ బాల్ వీడియో గేమ్ ఆడారు. చాలా కాంపిటీషన్ ఎదుర్కొటున్నట్లు సీరియస్ గా గేమ్ ఆడుతున్నారంటూ ధావన్ ట్వీట్ చేశాడు. మరో ట్వీట్ లో రవీంద్ర జడేజాతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. ఇక్కడ చాలా పచ్చగా ఉందని, ప్రశాంత వాతావరణం, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు అని తన పోస్ట్ లో ధావన్ రాసుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shikhar Dhawan  Virat Kohli  jadeja  India vs West Indies 2016  Team india  BCCI  cricket  

Other Articles