Virat Kohli tells team to avoid complacency after Antigua Test win

It s good to have contagious winning habit virat kohli

india vs west indies, west indies vs india, ind vs wi, wi vs ind, india tour of west indies, india cricket, west indies cricket, virat kohli, Jason Holder, Test series, anil kumble india, kumble cricket, kumble bowling, cricket, sports news, sports

India's Test skipper Virat Kohli has called on the team to maintain the winning habit and not get complacent after defeating the West Indies in the first Test by an innings and 92 runs.

అన్ని మ్యాచుల్లో గెలవాలనే బరిలోకి దిగుతాం

Posted: 07/25/2016 07:23 PM IST
It s good to have contagious winning habit virat kohli

ఆంటిగ్వా టెస్టులో డబుల్ సెంచరీ చేయడానికి కారణం భారతీయ అభిమానులేనని తన కష్టాన్ని మొత్తం అభిమానులకే అంకితం చేసిన టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి టెస్టు గెలిచిన తరువాత మీడియాతో మాట్లాడుతూ.. విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకోవాలనుకుంటున్నామని అన్నాడు. వరుస విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నామని చెప్పాడు. వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో  చారిత్రక విజయం సాధించింది. 63 ఏళ్లుగా వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న భారత్‌ తొలిసారి ఇన్నింగ్స్‌ విజయాన్ని సాధించింది.

నాలుగు టెస్టుల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును ఇన్నింగ్స్‌ 92 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ప్రతి మ్యాచ్ తమకు కొత్తదేనని అన్నాడు. ఒక మ్యాచ్ కు మరో మ్యాచ్ కు సంబంధమే ఉండదని పేర్కొన్నాడు. వెస్టిండీస్ తో జరగనున్న నాలుగు టెస్టు మ్యాచ్ ల్లో గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. అన్ని మ్యాచ్ లు గెలిస్తే సంతోషమే కదా అని కోహ్లి వ్యాఖ్యానించాడు. అదే సమయంలో తన సహచర అటగాళ్లను కూడా అప్రమత్తం చేశాడు. అంటిగ్వా టెస్టు ఫలితంతో విశ్వాసం పెరిగితే పర్వాలేదని, కానీ అది అతికి దారతీయకూడదని కోహ్లీ వ్యాఖ్యానించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  West Indies tour  India vs West Indies 2016  Team india  BCCI  cricket  

Other Articles