BIZARRE! When a Hyderabad girl landed up at Rahul Dravid's home and refused to leave

Hyderabad girl landed up at rahul dravid s home

Rahul Dravid, India, Hyderabadi fan, India A, cricket video, What The Duck, Vikram Sathaye, rahul, cricket, indian cricket team, fans, funny, bizarre, shocked, cricket news

Dravid however was extremely popular among women, thanks to his good looks and intellect. India A coach narrated his experience with a girl from Hyderabad.

మిస్టర్ డిఫెండబుల్ కూ ఎదురైన అరుదైన ఘటన..

Posted: 07/15/2016 06:38 PM IST
Hyderabad girl landed up at rahul dravid s home

టీమిండియా క్రికెట్ లో ది గ్రేట్ వాల్ గా, జంటిల్మన్ పేరోందిన టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్.. మితంగా మాట్లాడినా.. తన ప్రవర్తనతో ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. ఈ క్రికెటర్ కు కూడా అనూహ్య ఘటన ఒకటి ఎదురైందట. క్రికెట్ హ్యూమరిస్ట్ విక్రం సతాయేకు తాజాగా అడిగిన నేపథ్యంలో దానిని ద్రావిడ్ గుర్తచేసుకున్నాడు. అదేంటి అంటారా..? అ విషయాన్ని ద్రావిడ్ ఆసక్తికరంగా చెప్పకోచ్చాడు. ఆయన మాట్లల్లోనే విందాం..

ఒకసారి సుదీర్ఘ టూర్ తర్వాత ఇంటికొచ్చా. వచ్చీ రావడంతోనే నిద్రపోయా. సాయంత్రం నిద్రలేచా. ‘‘నీ అభిమాని అట. బయట వెయిట్ చేస్తోంది’’ అని అమ్మ చెప్పింది. హైదరాబాద్ నుంచి ఆమె వచ్చిందట. దాదాపు గంట నుంచి నా కోసం ఎదురుచూస్తోంది. ఆమెకు కాఫీ, టీలు ఇచ్చారు. నేను వెళ్లి ఆమెను కలిశా. ఆటోగ్రాఫ్, ఫొటోగ్రాఫ్ ఇచ్చా. ‘హలో.. బాగున్నారా?’ అని పలకరించా. మీరు హైదరాబాద్ నుంచి వచ్చారట. ఇది చాలా గొప్ప విషయం అని అన్నా’’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు. అయితే ఆ తర్వాత ఆమె చెప్పింది విని తాను షాక్ తిన్నానని రాహుల్ అన్నాడు.
 
ఆమెకు ఆటోగ్రాఫ్ ఇవ్వడంతోపాటు తనతో ఫొటో తీసుకునేందుకు ద్రవిడ్ అంగీకరించాడు. అయితే అనంతరం ఆమె నోటివెంట నుంచి వచ్చిన విషయం విని ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ‘‘మీతో కలిసి ఉండేందుకు నేను హైదరాబాద్‌లోని తండ్రిదండ్రులను వదిలేసి వచ్చేశా. మీ ఇంట్లో నాకా అవకాశం ఇవ్వండి’’ అని ఆమె వేడుకుంది. అంతే.. ఆమె చెప్పింది విన్న మాజీ ‘మిస్టర్ డిపెండబుల్’ నిశ్చేష్టుడయ్యాడు. తర్వాత తేరుకుని ‘‘అదెలా సాధ్యం, మీ తల్లిదండ్రులు ఎక్కడ? అని ప్రశ్నించాడట. ఆ తరువాత అమె తల్లిదండ్రులను పిలచి అమెను వారికి అప్పగించాడట. ఎంతైనా మిస్టర్ ఫర్ ఫెక్ట్ మరీ..!

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Dravid  India  What The Duck'  Vikram Sathaye  Hyderabadi fan  cricket  

Other Articles