New challenge for Dhoni as 2nd string India take on Zimbabwe

Dhoni s experimental india meet energetic zimbabwe

Ambati Rayudu, Axar Patel, Dhawal Kulkarni, Faiz Fazal, India in Zimbabwe 2016, India tour of Zimbabwe, Indian Premier League, IPL 2016, IPL 9, Jasprit Bumrah, Karun Nair, MS Dhoni, Yuzvendra Chahal

An Indian team, missing almost all of its first-choice players, is in Zimbabwe during the summer for another low-key limited-overs series.

ధోని కెప్టెన్సీకి జింబాబ్వే పర్యటన సరికోత్త సవాలే..

Posted: 06/10/2016 09:23 PM IST
Dhoni s experimental india meet energetic zimbabwe

జింబాబ్వే పర్యటనలో భాగంగా మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని యువకులతో కూడిన భారత క్రికెట్ జట్టు కొత్త సవాల్ కు సిద్ధమైంది.  తన రిజర్వ్ బెంచ్ను పరీక్షించుకునే క్రమంలో జింబాబ్వే పర్యటనకు వెళ్లి న భారత జట్టు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.  ఈ టూర్లో కెప్టెన్ ధోని మినహా  దాదాపు అంతా కొత్త వారే కావడంతో భారత జట్టు ఎంతవరకూ రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. దాదాపు 11 ఏళ్ల తరువాత ధోని, జింబాబ్వే పర్యటనకు రావడంతో ఆయనకు ఈ పర్యటన కోత్తగానే వుంటుందనే చెప్పాలి.  

అయితే తాజా పర్యటనలో ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో భారత జట్టుకు కఠిన పరీక్ష తప్పకపోవచ్చు. అటు జింబాబ్వే పసికూనగా కనిపిస్తున్నా, సంచలన విజయాలు నమోదు చేయడంలో ఆ జట్టు ఎప్పుడూ ముందుంటుంది. దీంతో ధోని అండ్ గ్యాంగ్ ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ఆడితేనే జింబాబ్వేపై విజయాలు సాధ్యమవుతాయి. ప్రస్తుత భారత జట్టు ఐదుగురు ఆటగాళ్లు తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ల్లో అరంగేట్రం చేయబోతున్నారు. వీరిలో యుజ్వేంద్వ చాహల్, ఫయాజ్ ఫజల్, మన్ దీప్ సింగ్, కరుణ్ నాయర్, జయంత్ యాదవ్లు భారత జెర్సీని  మొదటిసారి ధరించనున్నారు.

అయితే మరో యువ క్రికెటర్ లోకేష్ రాహుల్లు కూడా అంతర్జాతీయ అనుభవం తక్కువగానే చెప్పాలి. కేవలం టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడిన రాహుల్.. జింబాబ్వే పర్యటన ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ధోని తో పాటు, అంబటి రాయుడు, అక్షర్ పటేల్ కు మాత్రమే అంతర్జాతీయంగా ఆడిన అనుభవం ఉంది. రేపట్నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది.  భారత కాలమాన ప్రకారం శుక్రవారం  మధ్యాహ్నం గం.12.30 ని.లకు హరారే స్పోర్ట్స్ క్లబ్లో ఇరు జట్ల మధ్య  తొలి వన్డే జరుగునుంది. దీంతో సరికొత్త జట్టుకు ధోని ఏ వ్యూహ రచనతో సిద్ధం చేస్తాడో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  zimbabwe  one day series  cricket  

Other Articles