Sunrisers Hyderabad to display IPL trophy in Hyderabad

Srh display to display ipl trophy

Sunrisers Hyderabad,IPL,Indian Premier League,Deccan Chargers,David Warner, cricket news, cricket

sun rises hyderabad managment has taken decision to display IPL trophy in hyderabad for cricket and SRH fans

అభిమానుల కనువిందు కోసం ఐపీఎల్ ట్రోఫీ..

Posted: 06/04/2016 05:21 PM IST
Srh display to display ipl trophy

ఐపీఎల్-9లో చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ జట్టు హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్తను అందించింది. తమ జట్టుకు వెన్నంటే వుండి ప్రోత్సహించిన అభిమానులకు సన్ రైజర్స్ యాజామాన్యం తాము సాధించిన ట్రోఫీని అభిమానులు కళ్లారా చూసే అవకాశాన్ని కల్పించింది. ఐపీఎల్ ట్రోఫీని శనివారం ఇనార్బిట్ మాల్‌లో, ఆదివారం ఫోరం సుజనామాల్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రోఫీని అభిమానులకు అందుబాటులో ఉంచుతారు.

జట్టు గెలవడంలో హైదరాబాదీల సహకారం మరువలేనిదని యాజమాన్యం పేర్కొంది. ‘అభిమానుల సహకారం, వారి ప్రోత్సాహం జట్టులో స్ఫూర్తిని కలిగించాయి. వీరి అభిమానమే జట్టు విజేతగా నిలిచి కప్ గెలవడానికి కారణమైంది. వారి సహకారాన్ని గుర్తించేందుకు మేము చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కె. షణ్ముగం వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  India  IPL-9  Sunrisers  ipl championsTrophy  

Other Articles